A WEEK TO GO FOR “ONE DAY BRAHMOTSAVAM” _ జనవరి 28న తిరుమలలో రథసప్తమి
SURYA JAYANTI ON JAN 28
MALAYAPPA TO BLESS DEVOTEES ON SEVEN CARRIERS ON A SINGLE DAY
TIRUMALA, 19 JANUARY 2023: In connection with Surya Jayanthi, Radha Sapthami or the one-day Brahmotsavam will be observed in Tirumala on January 28.
VAHANA SEVAS:
Starting with Suryaprabha Vahanam in the morning between 5:30am and 8am with Sun rise scheduled at 6:45am
SCHEDULE OF VAHANAMS
9am to 10am-Chinna Sesha
11am to 12noon-Garuda
1pm to 2pm-Hanumantha
2pm to 3pm-Chakra Snanam
4pm to 5pm-Kalpavriksha
6pm to 7pm-Sarvabhoopala
8pm to 9pm-Chandraprabha Vahanam
TTD has cancelled arjita sevas including Kalynotsavam, Unjal Seva, Arjita Brahmotsavam, Sahasra Deepalankara Seva on the day owing to the one day festival.
జనవరి 28న తిరుమలలో రథసప్తమి
– ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామివారు దర్శనం
తిరుమల, 19 జనవరి 2023: సూర్య జయంతి సందర్భంగా జనవరి 28వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
వాహనసేవల వివరాలు :
ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం
ఉదయం 11 నుంచి 12 గంటల వరకు – గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం
ఆర్జిత సేవలు రద్దు :
ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.