జనవరి 7వ తేది నుండి 9వ తేది వరకు త్రైమాసిక శ్రీవారి మెట్లోత్సవం

జనవరి 7వ తేది నుండి 9వ తేది వరకు త్రైమాసిక శ్రీవారి మెట్లోత్సవం

తిరుపతి, జనవరి -05,2011 : తిరుమల తిరుపతి దేవస్థానములు దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 7వ తేది నుండి 9వ తేది వరకు 3 రోజులపాటు త్రైమాసిక శ్రీవారి మెట్లోత్సవం అంగరంగవైభవంగా జరుగుతుంది.మూడు రోజులపాటు జరిగే ఈ మెట్లోత్సవంలో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 120 భజన మండళ్ళు, కళాకారులు, వేదపండితులు పాల్గొని హరినామ సంకీర్తనలను ఆలపిస్తారు. ఈ సందర్భంగా మెట్లపూజ 9వ తేది ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా జరుగుతుంది. అనంతరం మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ఆలయానికి చెందిన శ్రీ సువిద్యేంద్ర తీర్థస్వాముల వారిచే అనుగ్రహ సందేశం వుంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.