జూన్‌లో టిటిడి ఉద్యోగుల క్రీడా పోటీలు – ఈవో

జూన్‌లో టిటిడి ఉద్యోగుల క్రీడా పోటీలు – ఈవో

తిరుమల, 2010 ఏప్రిల్‌ 27: తిరుమల తిరుపతి దేవస్థానములో పని చేయు ఉద్యోగులకు జూన్‌ నెలలో వార్షిక ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఉద్యోగులకు ఆటలపోటీలు చాలా అవసరమని అన్నారు. ఆటలపోటీలవలన పని ఒత్తిడి తగ్గడమే కాకుండా శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. తితిదే ఉద్యోగులు ప్రతి ఒక్కరు ఈ ఆటలపోటీలలో పాల్గొనాలని కోరారు. పాల్గొనదలచినవారు మే నెల 15వ తేదిలోపు తితిదే పరిపాలన భవనంలోని తితిదే ఉద్యోగుల యూనియన్‌ కార్యాలయం నందు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.