ANNUAL FETES OF THALLAPAKA TEMPLES FROM JULY 10-18 _ జూలై 10 నుండి 18వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
TIRUPATI, 05 JULY 2022: TTD is organising annual Brahmotsavams of Sri Chennakeshava Swamy temple and Sri Siddeswara Swamy temples at Tallapaka from July 10-18 with Ankurarpanam fete on July 9.
Every day morning there will be Pallaki Utsavams while on each day evening Sri Chennakeshava rides on a different carrier. Vahana Seva details as follows:
July 10:Dwajarohanam
July 11: Hamsa Vahanam
July 12:Simha Vahanam
July 13:Hanumantha Vahanam
July 14: Garuda Vahanam
July 15: Arjita Kalyanotsavam, Gaja vahana
July 16: Rathotsavam
July 17: Aswa vahana
July 18: Chakra Snanam and Dwajavarohanam in the evening.
July 19: Pushpa Yagam
As part of Brahmotsavam celebrations, the TTD will be organising cultural programs like Bhakti sangeet, Harikathas etc. by artists of HDPP and Annamacharya projects.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జూలై 10 నుండి 18వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2022 జూలై 5: అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో గల శ్రీ చెన్నకేశవస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూలై 9వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు.
జూలై 10న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి శేషవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 11, 12, 13, 14, 15, 16, 17వ తేదీల్లో ఉదయం పల్లకీ సేవ నిర్వహిస్తారు. అదేవిధంగా జూలై 11న రాత్రి హంస వాహనం, జూలై 12న రాత్రి సింహ వాహనం, జూలై 13న రాత్రి హనుమంత వాహనం, జూలై 14న రాత్రి గరుడవాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు.
జూలై 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 8.30 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు. జూలై 16న సాయంత్రం 6 గంటలకు రథోత్సవం, జూలై 17న రాత్రి అశ్వవాహనం, జూలై 18న ఉదయం 10 నుండి 11 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహన సేవలు నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.