COVID VACCINATION FOR TTD EMPLOYEES BEGINS _ టిటిడి ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం
Tirumala, 4 Mar. 21: Under the directions of TTD EO Dr KS Jawahar Reddy, TTD has commenced Covid vaccination for its employees at Tirumala on Thursday.
Initially, the employees who are discharging duties at pilgrim proximity areas including Srivari temple, Reception, Waterworks, Health wing and Vigilance wing will be administered vaccine jabs. The District Health Department had provided 50 vials of vaccine, which is adequate to serve 550 persons.
In the second phase, those who have crossed 45 years of age and suffering from Hypertension, Diabetes and other chronic diseases will be administered the vaccine.
All employees wanting vaccination should register themselves at the Aswini hospital with their Aadhaar or PAN cards and also sign on consent letters. After the first dose of vaccination, the second dose will be served after 28 days.
All hospital staff including doctors, nurses, and para medics were served Covid vaccines on Thursday morning. Aswini Medical Superintendent Dr Kusuma Kumari and other hospital staffs were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టిటిడి ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం
తిరుమల, 2021 మార్చి 04 : శ్రీవారి దర్శనానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు తిరుమలలో విధులు నిర్వహించే టిటిడి ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయడం గురువారం ఉదయం అశ్విని ఆసుపత్రిలో టిటిడి ప్రారంభించింది.
టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తిరుమల, తిరుపతిల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు కోవిడ్ – 19 వ్యాక్సిన్ వేయడం ప్రారంభించారు. ఇందులో మొదటగా శ్రీవారి ఆలయం, రిసెప్షన్, వాటర్ వర్క్స్, ఆరోగ్య విభాగం, భద్రాత విభాగం సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. రెండవ విడతలో 45 సంవత్సరాలు పైబడి బి.పి., షుగర్ తదితర సమస్యలు ఉన్నవారికి ఇవ్వడం జరుగుతుంది.
కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలనుకునేవారు టిటిడి ఉద్యోగులుముందుగా తమ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు చూపించి ఆసుపత్రి వద్ద పేర్లు నమోదు చేసుకొని, సమ్మతి పత్రంలో సంతకం చేసి సమర్పించవలసి ఉంటుంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తరువాత రెండవ డోస్ ఇస్తారు.
జిల్లా ఆరోగ్య విభాగంవారు తిరుమలకు పంపిన కోవిడ్ – 19 వ్యాక్సిన్ 50 వైల్డ్స్‌ను 550 మందికి వేయనున్నారు. కాగా గురువారం ఉదయం అశ్విని ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, మీడియా ప్రతి నిధులకు వ్యాక్సిన్ వేశారు.
అదేవిధంగా మార్చి 5వ తేదీ తిరుపతిలోని టిటిడి కేంద్రీయ వైద్యశాల నందు ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయనున్నట్లు టిటిడి యాజమాన్యం తెలిపింది.
ఈ కార్యక్రమంలో అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమ కుమారి, ఇతర డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.