POLY TECHNIC ANNUAL DAY OBSERVED _ టిటిడి కళాశాలల్లో చదవడం పూర్వజన్మ సుకృతం : జేఈవో శ్రీమతి సదా భార్గవి
TIRUPATI, 10 MARCH 2023: The 47th annual day of Sri Padmavati Mahila Polytechnic was celebrated with utmost gaiety by the faculty and pupils on Friday.
JEO for Health and Education Smt Sada Bhargavi who graced the function as Chief Guest in her address stated that it is a privilege for the students to get educated in a TTD Educational Institution with the benign blessings of Sri Padmavati Venkateswara.
Women are prospering in all fields and called up on the girls to work hard with dedication to achieve their goals. The college is providing all sort of facilities to the students. The DECE and D Pharmacy groups of the college are being recognized by National Board of Accreditation(NBA) certificate which is a praiseworthy feature. She greeted all the officials who worked hard to achieve the coveted identity.
DEO Sri Bhaskar Reddy, Principal Dr Asunta, SVU Engineering College former Principal Sri Muniratnam Naidu, faculty, students participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
టిటిడి కళాశాలల్లో చదవడం పూర్వజన్మ సుకృతం : జేఈవో శ్రీమతి సదా భార్గవి
– శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల 47వ వార్షికోత్సవం
తిరుపతి, 10 మార్చి 2023: శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాల చెంతగల టీటీడీ కళాశాలల్లో చదవడం విద్యార్థినుల పూర్వజన్మ సుకృతమని జేఈవో శ్రీమతి సదా భార్గవి పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల 47వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో మాట్లాడుతూ, ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, పట్టుదలతో శ్రమిస్తే అనుకున్న స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు. విద్యార్థినులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, క్రమశిక్షణతో నడచుకుని చక్కగా చదువుకోవాలని సూచించారు. ఈ కళాశాలలో నిర్వహిస్తున్న డిఇసిఇ, డి.ఫార్మసీ గ్రూపులకు నేషనల్ బోర్డు అఫ్ అక్రిడిటేషన్ (N.B.A.) గుర్తింపు లభించడం హర్షణీయమన్నారు. ఇందుకోసం సహాయ సహకారాలు అందించిన అన్ని విభాగాల అధికారులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ విద్యాశాఖ అధికారి డా. ఎం.భాస్కర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డా. జి.అసుంత, ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ శ్రీ ఎం.మునిరత్నం నాయుడు అధ్యాపకులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.