AP ENDOWMENT COMMISSIONER SWORN IN AS TTD EX OFFICIO MEMBER _ టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ప్రమాణస్వీకారం
Tirumala, 31 Oct. 21: AP endowment Commissioner Dr M Hari Jawaharlal was on Sunday sworn in as Ex officio member of the TTD trust board.
He was served oath of office by TTD JEO Smt Sada Bhargavi at the Srivari temple and thereafter the TTD Veda pundits offered Veda Ashirvachanam at the Ranganayakula Mandapam.
Later he was presented with Srivari thirtha Prasadam and portrait. DyEOs Sri Ramesh Babu and Smt Sudha Rani other TTD officials were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ప్రమాణస్వీకారం
తిరుమల, 2021 అక్టోబరు 31: రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ డా|| ఎం.హరి జవహర్‌లాల్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు.
తిరుపతి జెఈవో శ్రీమతి సదా భార్గవి డా|| ఎం.హరి జవహర్‌లాల్‌తో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని వారికి అందించారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.