TRICOLOUR FLIES VIBRANTLY DURING TTD’s R-DAY FEAT _ టీటీడీ పరిపాలనా భవనంలో మువ్వ‌న్నెల జెండా రెపరెపలు

DOG SHOW THRILLS SPECTATORS

Tirupati, 26 January 2024: The TTD EO Sri AV Dharma Reddy unfurled the national flag at TTD administrative building on Friday as part of the Republic Day celebrations and also received an attractive guard of honour presented by TTD vigilance wing.

TTD Chairman Sri Bhumana Karunakar Reddy participated as Chief Guest while the AVSO Sri Satish Kumar led the parade as commander.

After his inspiring address to the employees, the EO presented meritorious certificates and five grams silver dollar to 39 officials of various departments, 264 employees, two from SVIMS and seven from SVBC on the occasion.

The cultural programs included a resounding sankeertan and dance performance by students of SV college of Music and Dance. 

Sniffer Dogs show -a star attraction 

A display of skills by the Dogs of TTD vigilance wing  – Leela,Indu,Tiger and Honey – remained a star attraction of the parade led by the dog squad incharge Sri Ramana.

The dogs also showcased their skills in Group drill, detection of 

explosives, silent drills,fire jumps,protecting goods,catching, running, etc. receiving huge applause from the participants.

JEOs Smt Sada Bhargavi and Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, FA and CAO Sri O Balaji, CE Sri Nageswara Rao, DLO Sri Veeraju, Additional CVSO Sri Venkata Siva Kumar Reddy, CAuO Sri Sesha Shailendra, CPRO Dr T Ravi and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీ పరిపాలనా భవనంలో మువ్వ‌న్నెల జెండా రెపరెపలు

– ఆక‌ట్టుకున్న జాగిలాల ప్ర‌ద‌ర్శ‌న‌

తిరుపతి, 2024 జనవరి 26: తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో శ్రీ స‌తీష్ కుమార్‌ పెరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 39 మంది అధికారులు, 264 మంది ఉద్యోగులకు, స్విమ్స్‌లో ఇద్ద‌రికి, ఎస్విబిసిలో 7 మంది ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీ‌వారి వెండి డాలర్‌, ప్రశంసాపత్రం అందజేశారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు సంఘ‌ట‌న మ‌హా య‌జ్ఞం అనే కీర్తనను సుమధురంగా అలపించారు. అనంతరం మా తెలుగు త‌ల్లికి….,నాట్యమిదే ….గీతాల‌కు ప్ర‌ద‌ర్శించిన సంప్రదాయ నృత్యం ఆక‌ట్టుకుంది.

ప్రత్యేక ఆకర్షణగా టీటీడీ జాగిలాల ప్రదర్శన :

టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాగ్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జి శ్రీ ర‌మ‌ణ‌ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. లీలా, ఇందు, గంగా, టైగ‌ర్‌, హ‌ని అనే జాగిలాలు పాల్గొన్నాయి.

ఇందులో గ్రూప్‌ డ్రిల్‌, పేలుడు పదార్థాలను, మాదకద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్‌ డ్రిల్‌, ఫైర్ జంప్, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌,
ఎఫ్ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజి, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, డిఎల్‌వో శ్రీ వీర్రాజు, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్ రెడ్డి, సిఎవో శ్రీ శేష శైలేంద్ర, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.