డిశెంబర్ 9వ తేదిన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ”డిప్యూటీ ఈఓలపై తప్పిన ఈఓ గురి”, ”రిసెప్షన్ విభాగంలో పిల్లిమొగ్గలు, అధికారులపై విఐపిల ఆగ్రహం” అని ప్రచురించిన వార్తకు వివరణ
తిరుపతి, 2010 డిశెంబర్-10
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి
డిశెంబర్ 9వ తేదిన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ”డిప్యూటీ ఈఓలపై తప్పిన ఈఓ గురి”, ”రిసెప్షన్ విభాగంలో పిల్లిమొగ్గలు, అధికారులపై విఐపిల ఆగ్రహం” అని ప్రచురించిన వార్తకు వివరణ
డిశెంబర్ 9వ తేదిన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ”డిప్యూటీ ఈఓలపై తప్పిన ఈఓ గురి”, ”రిసెప్షన్ విభాగంలో పిల్లిమొగ్గలు, అధికారులపై విఐపిల ఆగ్రహం” అని ప్రచురించిన వార్త సత్యదూరం.
రిసెప్షన్ విభాగంలో ప్రోటోకాల్ ఉల్లంగించబడినదని ఈ మధ్య కాలంలో ఎటువంటి పిర్యాదురాలేదు.
డిప్యూటీ ఈఓల పోస్టింగులలో సమర్థత సామాజిక సమతుల్యయము, జెండర్ అంశాలను పరిగణలోనికి తీసుకొని పోస్టింగు ఇవ్వడం జరిగినది.
రిసెప్షన్ విభాగంలో పోస్టింగ్ అయిన ఇద్దరు సమర్థులు. పని భారమును సమర్థవంతంగా నిర్వహించగరు. చాలా వరకు ప్రోటోకాల్ విషయములను ఓ.యస్.డి. రిసెష్షన్ తన పరిధిలో సమర్థవంతంగా నిర్వహించడం జరుగుచున్నది. మొత్తాన్ని సమన్వయము చేసి పర్యవేక్షించడానికి స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ ఈఓ వున్నారు. రిసెప్షన్ ఆఫీసర్ల పని కేవలం ప్రోటోకాల్ మాత్రమే కాదు, సామాన్య భక్తులను కూడా సేవలందిచాల్సి వుంటుంది. ఈ కార్యక్రమాన్ని పై ఇద్దరూ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా అధికారుల మనోభావాలు దెబ్బతినేలా వార్తలు వ్రాయడం సరికాదని తెలియజేస్తున్నాము.
కనుక ఈ విషయాన్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.
ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి