డైరీ అసిస్టెంట్ (వెటర్నరీ అసిస్టెంట్ క్యాడర్) ఉద్యోగానికై జూన్ 12వ తేదిన వ్రాత పరీక్ష
డైరీ అసిస్టెంట్ (వెటర్నరీ అసిస్టెంట్ క్యాడర్) ఉద్యోగానికై జూన్ 12వ తేదిన వ్రాత పరీక్ష
తిరుపతి, మే,27, 2011: తిరుమల తిరుపతి దేవస్థానములలో డైరీ అసిస్టెంట్ (వెటర్నరీ అసిస్టెంట్ క్యాడర్) ఉద్యోగానికై ఇది వరకే ధరఖాస్తు చేసి న అభ్యర్థులకు వ్రాత పరీక్ష జూన్ 12వ తేదిన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక శ్రీవేంకటేశ్వర ఓరియంటల్ కళాశాలనందు నిర్వహిస్తారు.

వ్రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో వుంటుంది. ఈ పరీక్షకు అభ్యర్థులు ఉదయం 10.30 గంటలకే హాజరుకావాల్సి వుంటుంది. కళాశాల ప్రధానద్వారం ఉదయం 11 గంటలకే మూసివేస్తారు. ఈ వ్రాత పరీక్షకు సంబంధించిన మొత్తం సమాచారం గీగీగీ.శిరిజీతిళీబిజిబి.ళిజీవీ ద్వారా పొందవచ్చును.
అదేవిధంగా అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగానికై ఇదివరకే ధరఖాస్తు చేసిన అభ్యర్థులకు వ్రాత పరీక్ష స్థానిక శ్రీపద్మావతి మహిళా డిగ్రీ & పిజి కళాశాల నందు జూన్ 19వ తేదిన ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తారు. వ్రాత పరీక్షకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని తితిదే వెబ్సైట్ ద్వారా పొందవచ్చును. అదేవిధంగా కార్డులు జూన్10వ తేది నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.