తితిదేలో 10 ఔట్సోర్సింగ్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి
తితిదేలో 10 ఔట్సోర్సింగ్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి
జూలై 13వ తేదీన వాక్-ఇన్-ఇంటర్వ్యూ
తిరుపతి, 2012 జూలై 05: తితిదే ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో ఒక సంవత్సరం కాలపరిమితి గల 10 ఔట్సోర్సింగ్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జూలై 13వ తేదీన వాక్-ఇన్-ఇంటర్వ్యూ జరుగనుంది. ఎంబీబీఎస్ విద్యార్హత గల అభ్యర్థులు అర్హులు. తిరుపతిలోని యస్.వి.యూనివర్సిటీ ఎదురుగా గల తితిదే శ్వేత భవనంలో ఉదయం 11.00 గంటలకు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఇంటర్య్వూకు హాజరగు అభ్యర్థులు తమతోపాటు బయోడేటా, విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు జిరాక్స్ కాపీలు, రెండు స్టాంప్ సైజ్ ఫొటోలు తీసుకురావాలి. ఎంపికైక వారికి జి.ఓ.ఎంఎస్.నెం.459 హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యు(జె2) శాఖ, తేదీ :22.05.2002 ప్రకారం వేతనము మరియు కరువు భత్యము మాత్రమే ఇవ్వబడును. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం జరుగుతుంది. అభ్యర్థులు సొంత ఖర్చులతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.