ABHISEKAM TO AMMAVARU AT TIRUCHANOOR _ తిరుచానూరులో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అభిషేకం

Tiruchanoor, 3 Jun. 20: As a part of ongoing annual float festival of Sri Padmavati ammavaru,  abhisekam was performed to Sri Goddess Sri Padmavathi Devi inside the temple corridors in view of Covid-19 restrictions on Wednesday.

TTD is also organising daily abhisekam to Ammavari utsava idols on June 4 and 5 also as a part of Teppotsavam festival.

Dyeo Smt Jhansi Rani, AEO Sri Subramanyam and other officials participated.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI    

తిరుచానూరులో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అభిషేకం

తిరుపతి, 2020 జూన్ 03: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా మూడ‌వ రోజైన బుధ‌‌వారం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అభిషేకం జ‌రిగింది. కోవిడ్‌-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో  ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి.

ఇందులో భాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకుశ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తుల‌కు అభిషేకం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం ఇత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో ఉత్సవర్ల‌కు అభిషేకం చేశారు. కాగా జూన్ 4,5వ తేదీల‌లో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.