SERVE THE PILGRIMS WITH MORE DEDICATION-TTD CVSO _ తిరుపతిలో తితిదే విజిలెన్స్ దర్బారు
తిరుపతిలో తితిదే విజిలెన్స్ దర్బారు
తిరుపతి, 2012 ఆగస్టు 1: తితిదే నిఘా మరియు భద్రతా సిబ్బంది దర్బారు బుధవారం నాడు తిరుపతిలోని అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్‌లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ధార్మిక క్షేత్రమైన తిరుమలకు ప్రతిరోజూ లక్షలాది భక్తులు వస్తుంటారని, వారికి అకుంఠిత దీక్షతో, కార్యదక్షతతో సేవలు అందించాలని కోరారు. అనంతరం ఎర్రచందనం దుండగులను పట్టడంలో చాతుర్యాన్ని కనబరిచిన సిబ్బందిని, అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాల తనిఖీల్లో నిపుణత కనబరిచిన సిబ్బందిని నగదు బహుమతితో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తితిదే అదనపు సివిఎస్‌ఓ శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్పీఎఫ్ డీఎస్పీ శ్రీ రెడ్యానాయక్, ఏడుగురు ఎవిఎస్‌వోలు, దాదాపు 700 మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
ఆగస్టు 5న మహబూబ్‌నగర్‌లో వినికిడి లోపం గల చిన్నారుల గుర్తింపు శిబిరం
తితిదే ఆధ్వర్యంలోని శ్రవణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో వినికిడి లోపం గల చిన్నారులను గుర్తించేందుకు ఆగస్టు 5వ తేదీన మహబూబ్‌నగర్‌లో శిబిరం నిర్వహించనున్నారు. ఇందులో వినికిడి లోపం గల చిన్నారులకు వైద్యపరీక్షలు నిర్వహించి లోపాన్ని నిర్ధారించనున్నారు. కావున తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.