JAYANTOTSAVAMS OBSERVED _ తిరుపతిలో శ్రీవారి భక్తాగ్రగణ్యుల జయంతోత్సవాలు
Tirupati, 25 May 2021: The Jayantotsavams of the ardent devotees of Srivaru, Matrusri Tarigonda Vengamamba and Sri Tallapaka Annamacharya began at Annamacharya Kala Mandiram in Tirupati in Ekantam as per Covid guidelines.
SRI THALLAPAKA ANNAMACHARYA:
The 613th Jayanti of saint-poet Sri Thallapaka Annamacharya was observed besides garlanding the Annamaiah statue at the RC road in Tirupati on Tuesday.
Annamacharya had penned 32,000 sankeetans in praise of Sri Venkateswara lived between1408 and 1503 and was popular for his literary works and became popular as Padakavita Pitamaha.
MATRUSRI TARIGONDA VENGAMAMBA
The statue of Matrusri Tarigonda Vengamamba at the MR Palli circle was garlanded as part of the 291st Jayanti of the great saint poetess.
Vengamamba, an ardent devotee of Sri Lakshmi Narasimha Swamy and Sri Venkateswara Swamy was born in 1703 and went into Sajeeva Samadhi in 1817.
She is credited for launching Anna Prasada Vitarana at Tirumala and hence her name prefixed with sacred title Matrusri.
Director of the Annamacharya project Acharya Dakshinamurthy Sharma and other staffs were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుపతిలో శ్రీవారి భక్తాగ్రగణ్యుల జయంతోత్సవాలు
తిరుపతి, 2021 మే 25: తిరుమల శ్రీవారి భక్తాగ్రగణ్యులైన శ్రీ తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతోత్సవాలను తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం ఉదయం నిర్వహించారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఈ జయంతి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు.
శ్రీ తాళ్లపాక అన్నమయ్య :
అన్నమయ్య 613వ జయంతి సందర్భంగా అన్నమాచార్య కళామందిరం, ఆర్‌సి రోడ్డులోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహనికి పుష్పాంజలి ఘటించారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని కీర్తిస్తూ 32 వేల కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు. వీరు 1408లో జన్మించి, 1503లో పరమపదించారు. వీరు తొలి తెలుగు వాగ్గేయకారుడిగా, పదకవితా పితామహుడుగా ప్రఖ్యాతి పొందారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ :
శ్రీ తరిగొండ వెంగమాంబ 291వ జయంతి సందర్భంగా అన్నమాచార్య కళామందిరంలో, ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద గల వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
శ్రీవారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలు ప్రదర్శించిన శ్రీ తరిగొండ వెంగమాంబ 1730వ సంవత్సరంలో జన్మించారు. శ్రీ రాఘవేంద్రస్వామి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి లాగా తన బృందావనంలోనే 1817లో సజీవ సమాధి చెందారు. తిరుమలలో అన్నదానాన్ని ప్రారంభించినందుకు గుర్తుగా వెంగమాంబ పేరు ముందు మాతృశ్రీ అనే పదం చేరింది.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.