TIRUMALA REST HOUSES DON NEW LOOK TO ATTRACT DEVOTEES _ తిరుమలలో వసతులకు అనుగుణంగానే గదుల అద్దె నిర్ణయం

Tirumala, 07 January 2023:  TTD has modernised and given a new look to SV Rest House and Narayanagiri Rest House at Tirumala and revised the rentals accordingly to suit the needs of the pilgrim devotees.

The rents of these rest houses were almost three decades old. However upon the suggestions and feedback by devotees ACs,  Geysers, wooden cots and modern furniture were included and room tariffs have been rationalised suitably.

TTD  reiterated that it was wrong for a section of media to report that room rents in these rest houses have been hiked inordinately and appealed to devotees to make note of facts.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో వసతులకు అనుగుణంగానే గదుల అద్దె నిర్ణయం

తిరుమల, 07 జనవరి 2023: తిరుమలలోని ఎస్వీ గెస్ట్ హౌస్, నారాయణగిరి విశ్రాంతి గృహాలను భక్తుల కోరిక మేరకు ఆధునీకరించి, అక్కడి వసతులకు అనుగుణంగానే గదుల అద్దె నిర్ణయించడం జరిగింది. అయితే, కొన్ని పత్రికల్లో పేర్కొన్నట్టు గదుల అద్దె భారీగా పెంచేశారనడం వాస్తవం దూరం.

ఈ విశ్రాంతి గృహాల్లో దాదాపు 30 ఏళ్ల క్రితం అప్పటి వసతులకు అనుగుణంగా గదుల అద్దెను టిటిడి నిర్ణయించింది. అప్పటినుంచి అదే అద్దెను వసూలు చేస్తున్నారు. అయితే, పలువురు భక్తులు ఏసీతోపాటు అధునాతన సౌకర్యాలు కల్పించాలని సలహాలు, సూచనలు అందించిన మేరకు టిటిడి ఈ విశ్రాంతి గృహాల్లోని గదులను ఆధునీకరించింది. భక్తుల అభిమతానుసారం నూతన ఫర్నీచర్, ఏసి, వేడి నీటి కోసం గీజర్లు తదితర వసతులు కల్పించడం జరిగింది.

అయితే, సదరు పత్రికల్లో పేర్కొన్నట్లు గదుల అద్దెను భారీగా టిటిడి పెంచిందనడం వాస్తవం కాదు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేయడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.