JEO INSPECTS GHAT ROAD BEAUTIFICATION _ తిరుమల ఘాట్ రోడ్డు సుందరీకరణ పనులను పరిశీలించిన జెఈవో
Tirupati, 19 Mar. 21: JEO Smt Sada Bhargavi inspected the beautification works under progress all along the second Ghat road on Friday.
She directed the forest wing officials to plant colourful plants all along the rocky structures to enhance the beauty of Ghat roads. She instructed the concerned to take up first ghat road (down ghat) works also on a fast pace.
DFO Sri Chandrasekhar was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమల ఘాట్ రోడ్డు సుందరీకరణ పనులను పరిశీలించిన జెఈవో
తిరుమల 19 మార్చి 2021: తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డులో జరుగుతున్న సుందరీకరణ ( బ్యూటిఫికేషన్) పనులను జెఈవో శ్రీమతి సదా భార్గవి శుక్రవారం పరిశీలించారు.
ఘాట్ రోడ్లు, తిరుమల లో భక్తులకు ఆహ్లాదం కలిగించే విధంగా పూల మొక్కలతో సుందరీకరించాలని ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు అటవీశాఖ అధికారులు పనులను ప్రారంభించారు. అప్ ఘాట్ రోడ్డులో జరుగుతున్న పనులను జెఈవో శ్రీమతి సదా భార్గవి పరిశీలించారు. ఘాట్ లో కొండ చరియలు , రాతి బండలు కనిపించకుండా ఉండేలా వివిధ రకాల పూల మొక్కలు వేలాడదీసి పెంచే సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న పనుల వివరాలు ఆమె తెలుసుకున్నారు. అవసరమైన చోట భూమి చదువు చేసి తగిన పూల మొక్కలు పెంచాలని అధికారులను ఆదేశించారు. డౌన్ ఘాట్ రోడ్డులో వీలైనంత త్వరగా పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలిపిరి టోల్ గేట్ నుంచి వినాయక స్వామి గుడి వరకు ప్రత్యేక డిజైన్ లతో మొక్కల పెంపకం గురించి అధికారులతో చర్చించారు. ఘాట్ రోడ్డులో ఆమె మొక్కను నాటారు.
డిఎఫ్ ఓ శ్రీ చంద్రశేఖర్, రేంజ్ ఆఫీసర్ శ్రీ స్వామి వివేకానంద ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది