తిరుమల శ్రీవారికి రూ.5 లక్షల విరాళం

తిరుమల శ్రీవారికి రూ.5 లక్షల విరాళం

తిరుమల శ్రీవారికి సోమవారం రూ.5 లక్షలు విరాళంగా అందింది. తమిళనాడు రాష్ట్రం తిరుచ్చికి చెందిన శ్రీ జి.అరవింద్‌ ఈ మొత్తం డిడిని తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల ఎస్వీ నిత్యాన్నదానం ట్రస్టు కార్యాలయ అధికారులకు అందజేశారు. ఈ మొత్తాన్ని భక్తులకు అన్నదానం చేసేందుకు వినియోగించాలని కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.