INCREASE FREE BUSES – DHARMA RATHAS AT TIRUMALA- TTD EO SINGHAL _ తిరుమ‌ల‌లో ఉచిత బ‌స్సులను పెంచాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirupati, 16 Dec. 19: The Executive Officer of TTD, Sri Anil Kumar Singhal has instructed officials to increase the number and plying frequency of Dharma Rathams – free buses for benefit of devotees to move from one area to another at Tirumala.

During senior officers review meeting at the TTD administrative building on Monday the EO also asked the officials of the HDPP to prepare a calendar of programs in view of the enhanced and extended activity for the propagation of Hindu Sanatana Dharma.

He instructed the concerned to keep religious booklets on sanatana dharma at all bhajan mandir in remote regions in the state for benefit of school children.

He also wanted that TTD diaries and calendars also should be made available at all locations in Tirupati and Tirumala.

The EO also directed the engineering department to quickly select a qualified agency for electrical decoration of the Sri Kodandarama Temple at Vontimetta.

Later the EO asked officials of SVBC to upload on YouTube also, the popular Sanskrit Nerchukondam program currently streaming on favourite programme list on SVBC.

He directed officials to explore the possibility of putting of public notices and signboards at local temples recently taken over the TTD. “The Officials also should conduct an audit on the operation of air condition machines at TTD rest houses in Tirumala and Tirupati”, he said. Later he directed them to utilize LED bulbs in all rest houses and reduce power costs. 

He advised the IT wing for installation of more computers in Srivari Seva Sadan to get better and quick feedback from pilgrims.

Tirupati JEO Sri P Basant Kumar, FA & CAO Sri O Balaji, Chief Engineer Sri Ramachandra Reddy, IT head Sri Sesha Reddy and other senior officers participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

తిరుమ‌ల‌లో ఉచిత బ‌స్సులను పెంచాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుప‌తి, 2019 డిసెంబ‌రు 16: శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం విచ్చేసే భ‌క్తులు తిరుమ‌లలో ఒక ప్రాంతం నుండి మ‌రొక ప్రాంతానికి సౌక‌ర్య‌వంతంగా చేరుకునేందుకు వీలుగా ఉచిత బ‌స్సుల సంఖ్య‌ను పెంచాల‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ధ‌ర్మ ప్ర‌చారాన్ని విస్తృతం చేయ‌డంలో భాగంగా టిటిడిలోని వివిధ ప్రాజెక్టుల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాల‌తో వార్షిక క్యాలెండ‌ర్ రూపొందించాల‌న్నారు. పిల్ల‌లు చ‌దువుకునేందుకు వీలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గల భ‌జ‌న మందిరాల్లో భ‌క్తి, ఆధ్యాత్మిక పుస్త‌కాలు అందుబాటులో ఉంచేందుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేయాల‌ని సూచించారు. తిరుమ‌ల‌, తిరుప‌తితోపాటు అన్ని ప్రాంతాల్లో టిటిడి డైరీలు, క్యాలెండ‌ర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాల‌ని జెఈవోను కోరారు. టిటిడికి సంబంధించిన భూముల అంశాల‌ను ఎస్టేట్ క‌మిటీలో చ‌ర్చించాల‌ని ఎస్టేట్ అధికారిని ఆదేశించారు. ఒంటిమిట్ట‌లోని శ్రీ కోదండ‌రామాల‌య ప్రాకారానికి విద్యుత్ అలంక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టేందుకు నైపుణ్యం గ‌ల సంస్థ‌ను ఆహ్వానించాలని, అక్క‌డి ఇంజినీరింగ్ పనుల‌ను త్వ‌ర‌లో ప‌రిశీలిస్తాన‌ని అన్నారు.

ఎస్వీబీసీలో ప్ర‌సార‌మ‌వుతున్న సంస్కృతం నేర్చుకుందాం కార్య‌క్ర‌మానికి భ‌క్తుల నుండి ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని, దీన్ని యూట్యూబ్‌లోనూ ఎప్ప‌టిక‌ప్పుడు వీక్షించే అవ‌కాశం క‌ల్పించాల‌ని ఈవో కోరారు. టిటిడి ఆధీనంలోకి తీసుకున్న ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో సౌర ఫ‌ల‌కాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించాల‌న్నారు. తిరుమ‌ల‌, తిరుప‌తిలోని వివిధ కాటేజీలు, విశ్రాంతి గృహాల్లో ఉన్న ఎసిల‌పై ఆడిట్ నిర్వ‌హించాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు. ఆల‌యాలు, విశ్రాంతి గృహాల్లో ఎల్ఇడి బ‌ల్పులు వినియోగిస్తున్న కార‌ణంగా విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గించాల‌న్నారు. భ‌క్తుల‌కు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌పై శ్రీ‌వారి సేవ‌కుల నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకునేందుకు వీలుగా తిరుమ‌ల‌లోని శ్రీ‌వారి సేవా స‌దన్ల‌లో త‌గిన‌న్ని కంప్యూట‌ర్లు అందుబాటులో ఉంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఈ స‌మావేశంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రామ‌చంద్రారెడ్డి, ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.