దర్శనం క్యూలైన్లను తణిఖీ చేసిన తిరుమల జె.ఇ.ఓ
దర్శనం క్యూలైన్లను తణిఖీ చేసిన తిరుమల జె.ఇ.ఓ
తిరుమల, 31 మార్చి – 2013: గత మూడురోజులుగా తిరుమలకు అనూహ్యంగా అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో వివిధ దర్శన క్యూలైన్లను క్రమబద్ధీకరించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు స్వయంగా క్యూలైన్లను పర్యవేక్షిస్తూ ఆదివారంనాడు భక్తులకు దర్శన ఏర్పాట్లను కల్పించారు.
కాగా సర్వదర్శనం, రూ.300లు దర్శనం, దివ్యదర్శనం, సుదర్శనం క్యూలైన్లలో వేచివున్న భక్తులకు ఎప్పటికప్పుడు త్రాగునీరు, మజ్జిగ, అల్పాహారం, అన్నప్రసాదాలను ఉదయం నుండి రాత్రి వరకు ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రతి క్యూలైను చెంత శ్రీవారి సేవకులు గోవిందనామాన్ని సంబోధిస్తూ భక్తులకు త్రాగునీరు, పాలు, మజ్జిగ, ఆహారాన్ని అందించారు. భక్తుల రద్దీ దృష్ట్యా మధ్యాహ్నం గం.12.15 ని.లకు రూ. 300లు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని తి.తి.దే ఆపివేసింది.
జె.ఇ.ఓ తో పాటు ఆలయ డిప్యూటి.ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, పోటు పేష్కారు శ్రీ కేశవరాజు, ఎ.వి.ఎస్.ఓలు శ్రీ సాయిగిరిధర్, శ్రీ మల్లిఖార్జున దగ్గరుండి భక్తుల క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తూ వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.