DWAJAROHANAM AT CHANDRAGIRI SRI KRT BTU _ ధ్వ‌జారోహ‌ణంతో చంద్రగిరి శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tirupati, 22 April 2021: TTD organised grand Dwajarohanam on Thursday morning between 11.30-1215 am at Sri Kodandaramaswamy temple, Chandragiri in ekantham to kick start the annual Brahmotsavam.

Kankana bhattar Sri Srinivasa Bhattar performed the programs amidst, Mangala vadyam and Veda mantras after early morning abhisekam to Mula Virat and utsava idols.

Temple DyEO Sri Subramaniam, Superintendent Sri Kumar, Temple inspector Sri Krishna Chaitanya and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వ‌జారోహ‌ణంతో చంద్రగిరి శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2021 ఏప్రిల్ 22 : చంద్రగిరి శ్రీకోదండరామస్వామివారి ఆల‌యంలో గురువారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు  ప్రారంభ‌మ‌య్యాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

స‌క‌ల‌దేవ‌త‌ల‌ను బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆహ్వానిస్తూ ఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 12.15 గంట‌ల మ‌ధ్య  ధ్వ‌జారోహ‌ణం నిర్వ‌హించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేప‌ట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల‌‌ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కంక‌ణ‌బ‌ట్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాస బ‌ట్ట‌ర్‌‌ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఉదయం 5 నుండి 6 గంటల వరకు మూలవర్లకు అభిషేకం, ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు ఉత్సవర్లకు అభిషేకం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ  డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్‌ శ్రీ కుమార్‌,  టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణ‌చైత‌న్య‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.