నవంబర్‌ చివరి వారంలో భక్తులకు అందుబాటులో టిటిడి  క్యాలెండర్లు, డైరీలు

నవంబర్‌ చివరి వారంలో భక్తులకు అందుబాటులో టిటిడి  క్యాలెండర్లు, డైరీలు

తిరుమల, 2010 అక్టోబర్‌ 31: తిరుమల తిరుపతి దేవస్థానముల వివిధ రకాల క్యాలెండర్లను నవంబర్‌ చివరి వారంలో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నది.

ఈ సందర్భంగా రు.75/- వెల కలిగిన 12 పేజీల క్యాలెండర్లు నవంబర్‌ 15వ తేది నుండి, రు100/- వెల కల్గిన డైరీలు నవంబర్‌ చివరి వారం నుండి భక్తులకు విక్రయిస్తారు. తిరుపతి, తిరుమలతోపాటు, చెన్నై, హైదరాబాద్‌, బెంగుళూరు, విజయవాడ, విశాఖపట్నం అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో వున్న తితిదే కల్యాణమండపాలలో డైరీలు, క్యాలెండర్లను భక్తులకు అందుబాటులో వుంచుతాము.

పెద్దమొత్తంలో కొనేవారికి ముఖ్యంగా 10,000 క్యాలెండర్లు, ఆపై కొనుగోలు చేసే వారికి 20% డిస్కౌంట్‌, 2000 డైరీలు కొనుగోలు చేసే వారికి 10% డిస్కౌంట్‌ ఇవ్వడం జరుగుతుంది. వీటితోపాటు రు.7/-, రు.10/-ల వెలకల్గిన స్వామి, అమ్మవార్ల చిత్రాలతో కూడిన క్యాలెండర్లు కూడా అందుబాటులో వుంటాయి. వీరు తమ డిమాండ్‌ డ్రాప్టులను క్యాలెండర్లు, డైరీలకు విడివిడిగా ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, తితి దేవస్థానములు, కె.టి.రోడ్డు, తిరుపతి పేరున పంపాలి. ఈ డిడిలను కవరింగ్‌ లెటర్‌తో పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌, తితిదే, కె.టి.రోడ్డు తిరుపతి వారికి పంపాల్సిందిగా కోరడమైనది.    

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.