PARAKAMANI ACTIVITY COMMENCES IN THE NEW BUILDING _ నూతన పరకామణి భవనంలో శ్రీవారి కానుకల లెక్కింపు ప్రారంభం : టిటిడి ఈవో

TIRUMALA, 05 FEBRUARY 2023: TTD EO Sri AV Dharma Reddy said, the activities of Parakamani including counting and accounting of the offerings made by devotees in Srivari Hundi at Tirumala commenced on Sunday from the new Parakamani building.

After participating in the puja, the EO told reporters, the building was constructed on donation by the Bengaluru-based donor Sri Muralikrishna with 23 crores including the setting up of advanced counting machines. This spacious building was inaugurated by the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy on September 28 last. After installing the necessary CCTVs, some infrastructure arrangements, the Parakamani activity commenced in the building, the EO added.

Earlier, during the first bell in Tirumala temple, the Hundis from the temple were lifted through a slim lift and loaded in specially designed lorry and brought to the new building with the blessings of HH Sri Pedda Jeeyar Swamy of Tirumala in the presence of TTD EO. Later, Vastu Homam and Gopuja were performed in the new Parakamani building before commencing the counting and accounting activity.

CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, EEs Sri Jaganmohan Reddy, Sri Srihari, DE Electrical Sri Ravishankar Reddy, DyEO Parakamani In-charge Sri Rajendra Kumar, VGO Sri Bali Reddy, and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

నూతన పరకామణి భవనంలో శ్రీవారి కానుకల లెక్కింపు ప్రారంభం : టిటిడి ఈవో

తిరుమల, 05 ఫిబ్రవరి 2023: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో ఆదివారం ఉదయం నుండి లెక్కించడం ప్రారంభించినట్లు టిటిడి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో నూతన పరకామణి భవనంలో ఈవో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, బెంగుళూరుకు చెందిన దాత శ్రీ మురళీకృష్ణ సహకారంతో నూతన పరకామణి భవనాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాటుు చేసినట్లు చెప్పారు. గత ఏడాదిి సెప్టెంబర్ 28న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన పరకామణి భవనాన్న ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో సీసీ కెమెరాలు, ఇతర మౌలిిక వసతులు కల్పన పూర్తయినందున ఆదివారం ఉదయం నుండి కానుకలను లెక్కించడం ప్రారంభించినట్లు తెలియజేశారు.

తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి వారి ఆశీస్సులతో ఉదయం 5.30 గంటలకు శ్రీవారి ఆలయం నుండి 12 హుండీలు చిన్న లిఫ్ట్ సహాయంతో లారీలో తరలించినట్లు చెప్పారు. ఇకపై ప్రతిరోజు అన్ని హుండీలు నూతన పరకామణి భవనానికి చేరుకుంటాయన్నారు. నెల రోజుల తరువాత ఆలయంలోని పరకామణి మండపాన్ని భక్తులు కూర్చునేందుకు అనువుగా తీర్చిదిద్దనున్నట్లు ఈవో వివరించారు.

అంతకుముందు నూతన పరకామణి భవనంలో వాస్తు హోమం, గోపూజ, శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఈవో పరకామణి లెక్కింపును పరిశీలించి, పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవో పరకామణి ఇంచార్జ్ శ్రీ రాజేంద్రకుమార్, ఈఈలు శ్రీ శ్రీహరి, శ్రీ జగన్మోహన్ రెడ్డి, డిఇ శ్రీ రవి శంకర్ రెడ్డి, విజివో శ్రీ బాల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.