HDPP WEBSITE SHOULD DISPLAY YEAR LONG ACTIVITY-JEO TPT_ పూర్తి సమాచారంతో హిందూ ధర్మప్రచార పరిషత్ వెబ్‌సైట్ : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
Tirupati, 12 September 2017: The new Hindu Dharma Prachara Parishad website which was launched during last week should display the year long calendar of activity for the information of Bhajan Mandalis, said Tirupati Joint Executive Officer Sri P Bhaskar.
A review meeting in the chambers of Tirupati JEO was held in the chambers of Tirupati JEO in Administrative building on Tuesday with HDPP, TTD Publications, Sapthagiri Magazine on their respective activities.
The JEO said the website should have the entire data of area wise Bhajana Mandalis and their activities and instructed the IT wing officials to design website in such a way it should inform the global devotees about the dharmic and spiritual activities of HDPP. He also said some devotional books and songs should also be placed on website”, he directed the officials concerned.
HDPP Secretary Sri Ramakrishna Reddy, IT wing chief Sri Sesha Reddy, Chief Editor Sri Radha Ramana, Puranetihasa Special Officer Dr S Lakshmanaiah, Publications Special Officer Dr T Anjaneyulu were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
పూర్తి సమాచారంతో హిందూ ధర్మప్రచార పరిషత్ వెబ్‌సైట్ : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
సెప్టెంబర్ 12, తిరుపతి, 2017: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ వెబ్‌సైట్‌ను పూర్తిస్థాయి సమాచారంతో రూపొందించాలని తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో మంగళవారం టిటిడి ఐటి అధికారులు, హెచ్‌డిపిపి, ప్రచురణల విభాగం, సప్తగిరి మాసపత్రిక, వివిధ ప్రాజెక్ట్‌ల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పోల భాస్కర్ మాట్లాడుతూ ఈ వెబ్‌సైట్‌లో ధర్మప్రచారం కోసం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్నీ భక్తులు సులభంగా తెలుసుకునేలా పొందుపరచాలన్నారు. కార్యక్రమాల వార్షిక క్యాలెండర్లు, నిర్వహించే ప్రదేశం, వాటి విశిష్టత, ఆయా ప్రాంతాల్లోని ధర్మప్రచార మండళ్లు, భజన మండళ్ల వివరాలు ఉండాలన్నారు. ధార్మిక, స్ఫూర్తిదాయక గ్రంథాలు, భక్తి సంకీర్తనలను భక్తులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ ధర్మప్రచార కార్యక్రమాలు చేరేలా వెబ్‌సైట్‌ను రూపొందించాలని జెఈవో ఆదేశించారు.
ఈ సమావేశంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, సప్తగిరి మాసపత్రిక చీఫ్ ఎడిటర్ డా|| రాధారమణ, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| సముద్రాల లక్ష్మణయ్య, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా||తాళ్లూరు ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.