CVSO FELICITATES_ పోటులో అగ్నిప్రమాదాన్ని అరికట్టిన టిటిడి అగ్నిమాపక సిబ్బందికి సివిఎస్‌వో సత్కారం
Tirupati, 7 September 2017: The chief vigilance and security officer of TTD Sri A Ravikrishna has felicitated the fire fighting personnel who executed their work with responsibility in a profession manner with perfection.
The event took place in the chambers of CVSO in Tirupati on Thursday and he lauded the efforts of the staff who responded quickly to lit off the fire at Boondi Potu in Tirumala on September 2.
He encouraged them to continue to work with the same spirit in future too and asked them to be more alert in their duties.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
పోటులో అగ్నిప్రమాదాన్ని అరికట్టిన టిటిడి అగ్నిమాపక సిబ్బందికి సివిఎస్‌వో సత్కారం
సెప్టెంబర్ 07, తిరుపతి, 2017 : తిరుమలలోని బూందీపోటులో సెప్టెంబరు 2వ తేదీన సంభవించిన అగ్నిప్రమాదాన్ని సకాలంలో స్పందించి అరికట్టినందుకు గాను ఆరుగురు అగ్నిమాపక సిబ్బందిని టిటిడి సివిఎస్వో శ్రీ ఆకె రవికృష్ణ సత్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సివిఎస్వో కార్యాలయంలో గురువారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది.
టిటిడి అగ్నిమాపక విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీ శ్రీహరి జగన్నాథంతోపాటు హోంగార్డులు శ్రీ జయచంద్ర, శ్రీ ఫక్కీరయ్య, శ్రీ శేఖర్, శ్రీఎంఆర్‌కె.నాయక్, శ్రీ శంకర్, శ్రీ పిఎల్‌ఆర్.కుమార్‌ను సివిఎస్వో శాలువ, నగదు రివార్డుతో సన్మానించారు. భవిష్యత్తులోనూ ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆయన కోరారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.