ప్రసన్న వెంకన్నకు తిరుమల వెంకన్న లక్ష్మీహారం

ప్రసన్న వెంకన్నకు తిరుమల వెంకన్న లక్ష్మీహారం

తిరుపతి, జూన్‌ 22, 2013: తిరుమలలో గరుడసేవ రోజు శ్రీ మలయప్పస్వామివారికి అలంకరించే లక్ష్మీహారాన్ని ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయం నుండి అప్పలాయగుంటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.

తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఉదయం 10.30 గంటలకు లక్ష్మీహారం ఊరేగింపుగా బయల్దేరింది. మధ్యాహ్నం 12.00 గంటలకు తిరుపతిలోని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం వద్దకు చేరుకుంది. అక్కడి నుండి శంకరంబాడి వలయం వరకు, అప్పలాయగుంటలోని పురవీధుల్లో శోభాయాత్ర వైభవంగా జరిగింది.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి జరిగే గరుడ సేవలో లక్షీహారాన్ని స్వామివారికి అలంకరిస్తారు. గరుడ సేవ అనంతరం లక్ష్మీహారాన్ని తిరిగి తిరుమల శ్రీవారి ఆలయానికి తీసుకొస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.