PROCESSION OF SRI KODANDARAMASWAMI TO KUPUCHANDRAPETA ON FEB 28 _ ఫిబ్రవరి 28న కూపుచంద్రపేటకు శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు

Tirupati, 26 February 2021: As part of the tradition, the utsava idols of Sri Sitalakshmana Sametha Kodandaramaswami will be taken on a procession to the Kupuchandrapeta village on February 28, Sunday.

The idols will be taken to the village which is 8 kms away from Tirupati where Snapana Tirumanjanam is performed at noon. Thereafter Unjal Seva and Gramotsavam will be conducted before returning the idols to Sri Kodandaramaswami temple.

Every year on the Pournami day of Magha masa the utsava idols of Sri Kodandaramaswami temple will participate in the gramotsavam festivities of Kupuchandrapeta village.

The artists of the HDPP and Dasa Sahitya project will present bhajans, kolatams and cultural programs in the village festival.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఫిబ్రవరి 28న కూపుచంద్రపేటకు శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు

తిరుపతి, 2021 ఫిబ్రవరి 26: తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 28వ తేదీ కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.

శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 5 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 10 గంటలకు చేరుకుంటారు.

అనంత‌రం ఉదయం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు స్వామి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల‌సేవ‌, సాయంత్రం 5 గంట‌లకు గ్రామోత్స‌వం నిర్వ‌హించి, తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.