TTD EO VISITS TTD SV TEMPLE AT BANGALORE _ బెంగ‌ళూరులోని శ్రీ‌వారి ఆల‌యాన్ని సంద‌ర్శించిన టిటిడి ఈవో

Tirupati, 02 September 2021: TTD Executive Officer Dr KS Jawahar Reddy on Thursday visited the Sri Venkateswara temple at Vaiyyalikaval, Malleswaram, Bangalore, a TTD subsidiary temple.

He was received with Purna Kumbha honours by the temple officials and rendered Veda Ashirvachanam by pundits after he had darshan.

Thereafter the TTD EO along with SVBC CEO Sri Suresh Kumar visited the premises of SVBC Kannada channel and also the TTD Kalyana Mandapam.

Speaking to media persons later TTD EO said that the full-fledged SVBC Kannada channel shall be launched in October.

He instructed the SVBC CEO to prepare programs on sankeertans of Saint Purandara Dasa as part of the Kannada channel launch.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బెంగ‌ళూరులోని శ్రీ‌వారి ఆల‌యాన్ని సంద‌ర్శించిన టిటిడి ఈవో

తిరుపతి,  2021 సెప్టెంబ‌రు 02: టిటిడి ఈఓ డాక్ట‌ర్ కెఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం బెంగళూరు న‌గ‌రంలోని వయ్యాలికావల్ ప్రాంతంలో గ‌ల శ్రీ‌వారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఈఓకు టిటిడి అధికారులు, అర్చ‌కులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.

అనంతరం ఈఓ అక్క‌డి టిటిడి కల్యాణ‌మండ‌పాన్ని, శ్రీ వేంక‌టేశ్వ‌ర భక్తి ఛాన‌ల్ కన్నడ కార్యాలయాన్ని ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ రానున్న అక్టోబర్ నెల‌లో ఎస్వీబీసీ కన్నడ ఛానెల్ ప్ర‌సారాల‌ను ప్రారంభిస్తామ‌న్నారు. ఛానల్ ప్రారంభం సందర్భంగా పురందరదాస కీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎస్వీబీసీ సీఈఓ శ్రీ సురేష్ కుమార్‌కు సూచించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.