DEVELOP SV MUSEUM FOR SPIRITUAL EMPOWERMENT OF DEVOTEES- TTD EO _ భక్తులకు దివ్యానుభూతి కల్పించేలా మ్యూజియం అభివృద్ధి – టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Tirupati, 01 August 2023: TTD EO Sri AV Dharma Reddy urged officials to enhance the spiritual ambience of the SV Museum to recreate the presence of devotees at Srivari temple.
Addressing a review meeting with officials of TCS, Map Institute and SV Museum at the TTD administrative building conference on Tuesday afternoon, the TTD EO asked the officials to speed up works on the spiritual ambience in the first zone. In the second zone on the Annamaiah Gallery, Dhyan mandir, ornaments of Srivaru, numismatics and historical artefacts with hologram technology.
Among others, he wanted coordinated work of all agencies especially on the 3D display of Swami jewellery, portrayal of Maha Vishnu to be bewitching in the third zone as lakhs of devotees visit the museum every day.
The officials of TCS and Map Institute made a presentation on the progress of Museum works.
SV Vedic University VC Acharya Rani Sadashiv Murti, SVBC CEO Sri Shanmukh Kumar, SE-2 Sri Jagadeeshwar Reddy, Srivari temple archakas Sri Ramakrishna Dikshitulu, TTD Museum Officer Sri Krishna Reddy, Museum experts Professor Kulkarni, Sri Shivangi Reddy, Sri MS Reddy, Museum architect Sri Sharat, Map systems official Sri Sharan, TCS program Director Sri Bhimshekar were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భక్తులకు దివ్యానుభూతి కల్పించేలా మ్యూజియం అభివృద్ధి – టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి, 2023 ఆగస్టు 01: తిరుమల ఎస్వీ మ్యూజియంలోకి అడుగుపెట్టే భక్తులకు సాక్షాత్తు తాము శ్రీవారి ఆలయంలో ఉన్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా మ్యూజియం పనులు పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి కోరారు. టీటీడీ పరిపాలన భవనంలో మంగళవారం ఆయన టిసిఎస్, మ్యాప్ సంస్థల అధికారులు, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మ్యూజియం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. మ్యూజియంలోని ఒకటో జోన్‌లో ఆలయ అనుభూతి కల్పించే పనులు, రెండో జోన్‌లో అన్నమయ్య గ్యాలరీ, ధ్యానమందిరం, స్వామివారి ఆభరణాలు, నాణేలు, పురాతన వస్తువులు హోలోగ్రామ్ టెక్నాలజీతో ప్రదర్శించే ఏర్పాటు చేయాలన్నారు. ఆభరణాల 3డి ఇమేజింగ్ ద్వారా భక్తులు తాము స్వామివారి నిజమైన ఆభరణాలు చూస్తున్నామనే అనుభూతి కల్పించాలని చెప్పారు. మూడో జోన్‌లో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కళ్లకు కట్టినట్టు కనిపించేలా అందరూ సమష్టి కృషి చేయాలని సూచించారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు సందర్శించే మ్యూజియం పనుల్లో నిమగ్నమైనవారు మనసు లగ్నం చేసి భక్తితో పని చేయాలని కోరారు. టిసిఎస్, మ్యాప్ సంస్థల ప్రతినిధులు మ్యూజియం అభివృద్ధికి సంబంధించిన డిజైన్లపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
వేద వర్సిటీ విసి ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీ రామకృష్ణ దీక్షితులు, మ్యూజియం నిపుణులు ప్రొఫెసర్ కులకర్ణి, శ్రీ శివనాగిరెడ్డి, శ్రీ ఎవిఎస్.రెడ్డి, మ్యూజియం ఆర్కిటెక్ట్ శ్రీ శరత్, మ్యాప్ సిస్టమ్స్ అధికారి శ్రీ శరణ్, టిసిఎస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీ భీమశేఖర్, పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.