”మనగుడి..తడబడి” అను వార్త వాస్తవదూరం.

‘మనగుడి..తడబడి” అను వార్త వాస్తవదూరం.

వివరణ(తిరుపతి, ఆగస్టు 21, 2013)

ఆగస్టు 21వ తేదిన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ”మనగుడి..తడబడి” అను వార్త వాస్తవదూరం.
మనగుడి నిర్వహణకు కొందరు తితిదే అధికారులు వెల్లడం జరిగింది. ప్రస్తుతం నెలకొన్న శాంతి భద్రతల కారణంగా కొందరు వెళ్ళలేదు.గతంలో ప్రతి ప్రాంతానికి అధికారులను పంపడం ద్వారా తితిదే కార్యవ్యవహారములు మందగిస్తున్నందు వలన, జిల్లాలల్లో ఏర్పాటు చేసిన ధర్మ ప్రచార మండలికి నిర్వహణ భాధ్యతను అప్పజెప్పడం జరిగింది. కేవలం స్వామికైంకర్యమే మార్గంగా నిస్వార్థంగా, ఏ ప్రతిఫలం లేకుండా ముందుకు వచ్చిన వారిని నిర్వాహక వర్గంగా ఏర్పరచి, శిక్షణను ఇచ్చి వారికి ఈ కార్యక్రమాన్ని అప్పజెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్వహణ ఖర్చు అనగా కంకణాలు, పుస్తకాలు, ప్రసాదాలు, రవాణా అన్నియు కల్పి సుమారు రూ.1,60,00,000-00(కోటి అరవై లక్షలు) ఖర్చు అంచనాగా ఈ కార్యక్రమం చేపట్టబడింది. ఇప్పటి వరకు 23 జిల్లాలకు 70లక్షల రూపాయాలను విడుదల చేయడం జరిగింది. వీటిని అధ్యక్ష, కార్యదర్శులు సంయుక్తంగా  డ్రా చేసి ధర్మ ప్రచారపరిషత్తు సూచించిన మేరకు ఖర్చు చేస్తారు. వీటి అన్నింటి రసీదు, ఓచర్లతో పాటు ఖర్చుల వివరణను చార్టెడ్‌ అకౌంటెంట్‌ చేత పరిశీలించి ధృవీకరించబడుతాయి. కావున పత్రికలో వచ్చిన విధంగా రెండు కోట్లు విడుదల చేయలేదు, నిధుల దుర్వినియోగాన్ని సహించే ప్రసక్తే లేదు.
మనగుడి కార్యక్రమానికి అవసరమైన ఫ్లెక్సీలు, కంకణాలు, తెరలు టెండర్ల ద్వారా స్వీకరించడం ద్వారా గతంలో కంటే ఖర్చును తగ్గిస్తూ, ఎక్కువ దేవాలయాలల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రిక నందు వివరణగా ప్రచురించవలసిందిగా కోరుచున్నాము.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి