SPECIAL EVENTS AT TIRUPATI SRI KODANDARAMA SWAMY TEMPLE IN MARCH _ మార్చిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 29 February 2024: Many special festivals will be held in Tirupati Sri Kodanda Rama Swamy Temple in the month of March. Their details are as follows.

Abhishekam will be performed for Sri Sitarama Lakshmana Moolavarlu on March 2, 9, 16, 23 and 30  at 6 am on Saturday.

Sahasra Kalasabhishekam will be performed on March 10 on the occasion of Amavasya at 8 am. Hanuman Vahanaseva will be held on the same day evening at 7 pm.

On the occasion of Punarvasu Nakshatra on March 19, Sri Sitarama Kalyanam will be held at 11 am. At 5.30 pm the deities are taken in a procession through the four mada streets on the Tiruchi temple to Sri Ramachandra Pushkarini. Unjal seva will be performed at 6.30 pm. 

Ashtottara Shatakalasabhishekam will be performed at 8.30 am on the occasion of full moon day on March 25. At 5.30 pm, Tiruchi Utsav will be held from the four mada streets of the temple to Sri Ramachandra Pushkarini. Temple Court will be held at 6.30 pm.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2024 ఫిబ్ర‌వ‌రి 29: తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– మార్చి 2, 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.

– మార్చి 10న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

– మార్చి 19న‌ పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– మార్చి 25న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.