మార్చి 17న శ్రీ కోదండరామాలయంలో శ్రీమద్రామాయణ గోష్ఠి
మార్చి 17న శ్రీ కోదండరామాలయంలో శ్రీమద్రామాయణ గోష్ఠి
తిరుపతి, మార్చి 15, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మార్చి 17వ తేదీన ఆలయంలో శ్రీమద్రామాయణ గోష్ఠి నిర్వహించనున్నారు.
వాల్మీకి మహర్షికి, సప్తరుషులకు మధ్య జరిగిన సంవాదమే శ్రీమద్రామాయణ గోష్ఠి. ఈ గోష్ఠిలో సప్తరుషులు ఒక్కొక్కరు ఒక్కో శ్లోకంలో రామాయణ కాండాలు, అధ్యాయాలు పేర్కొంటూ వాల్మీకి సందేహాలను నివృత్తి చేస్తారు. అనంతరం వాల్మీకి శ్రీరామాయణ రచనకు శ్రీకారం చుట్టినట్టు పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు.
మార్చి 17వ తేదీ ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు శ్రీకోదండరాముల వారి డోలోత్సవ సమయంలో ఈ కార్యక్రమం జరుగనుంది. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని రామాయణ విశేషాలను తెలుసుకోవాలని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.