ANNAMACHARYA VARDHANTI FETE ON MARCH 18 _మార్చి 18న తిరుమ‌ల‌లో శ్రీ తాళ్లపాక అన్నమ‌య్య‌ 520వ వర్ధంతి

TIRUMALA, 10 MARCH 2023: The 520 Death Anniversary of Sri Tallapaka Annamacharya will be observed in Tirumala on March 18.

 

Sankeertana Tributes will be paid to the great saint poet at Narayanagiri gardens from 6pm onwards in the presence of Sri Bhu Sameta Sri Malayappa Swamy.

 

Ahobila Mutt Seer will render his Anugraha Bhashanam on the occasion.

 

Director Annamacharya Project Dr Vibhishana Sharma is supervising the arrangements.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

మార్చి 18న తిరుమ‌ల‌లో శ్రీ తాళ్లపాక అన్నమ‌య్య‌ 520వ వర్ధంతి

తిరుమల, 2023 మార్చి 10: తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 520వ వర్ధంతి కార్యక్రమాలు మార్చి 18వ తేదీ సాయంత్రం తిరుమ‌ల‌లో ఘనంగా జ‌రుగ‌నున్నాయి.

ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యం నుండి బ‌య‌ల్దేరి సాయంత్రం 6 గంట‌ల‌కు నారాయ‌ణగిరి ఉద్యాన‌వ‌నాల‌కు వేంచేపు చేస్తారు. అనంత‌రం ప్రముఖ కళాకారులతో దిన‌ము ద్వాద‌శి సంకీర్త‌న‌లు, సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. ఆ త‌రువాత అహోబిలం, శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం 46వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తారు. చివ‌ర‌గా శ్రీ తాళ్ల‌పాక వంశీయుల‌కు స‌న్మాన కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.