FEED MIXING PLANT TO BECOME OPERATIONAL FROM MARCH 31 _ మార్చి 31న టీటీడీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ప్రారంభం – జేఈవో శ్రీమతి సదా భార్గవి
TIRUPATI, 25 MARCH 2023: The feed mixing plant in SV Goshala in Tirupati will become operational from March 31 onwards, said TTD JEO for H&E Smt. Sada Bhargavi.
During her inspection to the plant on Saturday, she said that the feed mixing plant was constructed using modern technology in the Goshala with the intention of providing fortified feed to the cattle with a donation of Rs 11 crore.
Sri Venkateswara Veterinary University and US-based Dew Biotech signed an MoU with TTD to set up the plant which will be inaugurated by TTD Chairman Sri YV Subba Reddy and EO Sri AV Dharma Reddy on March 31.
Dr. Padmanabha Reddy, Vice-Chancellor of the Veterinary University, said that the milk given by the cows in the TTD Goshala does not have enough protein. They have learned this matter through research and suggested TTD to provide fortified and comprehensive feed to the cows in its Goshala. He said that the MoU was signed as TTD has come forward to build its own feed mixing plant. By giving this feed, the protein content of the milk given by the cows is increased and 10 to 15 percent more milk is obtained now, he said.
Chief Engineer Sri Nageswara Rao, Goshala Director Dr. Haranatha Reddy, Veterinary University Registrar Dr. Ravi participated
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చి 31న టీటీడీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ప్రారంభం – జేఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి 25 మార్చి 2023: టీటీడీ గోశాలలో ఉన్న సుమారు 2 వేల గోవులు, పశువులకు బలవర్ధకమైన సమగ్ర దాణా అందించాలనే ఉద్దేశంతో గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మించామని జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు.
జేఈవో అధికారులతో కలసి శనివారం సాయంత్రం ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, రూ 11 కోట్ల విరాళంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మించినట్లు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, అమెరికాకు చెందిన డ్యూ బయోటెక్ సంస్థ తో టీటీడీ ఎంఓయు కుదుర్చుకుందని ఆమె తెలిపారు. ఈ ప్లాంట్ ను మార్చి 31వ తేదీ టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ
ఎ వి ధర్మారెడ్డి ప్రారంభిస్తారని ఆమె తెలిపారు.
పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ, టీటీడీ గోశాలలోని గోవులు ఇస్తున్న పాలలో ఉండాల్సినన్ని ప్రోటీన్లు లేవని చెప్పారు. ఈ విషయం తాము పరిశోధనల ద్వారా తెలుసుకుని టీటీడీ గోశాలలోని గోవులకు బలవర్ధకమైన సమగ్ర దాణా అందించాలని టీటీడీ కి సూచించామన్నారు. టీటీడీ సొంతంగా ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు రావడంతో ఎంఓయు కుదర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాణా ఇవ్వడం ద్వారా గోవులు ఇస్తున్న పాలలో ప్రోటీన్ శాతం బాగా పెరగడంతో పాటు 10 నుంచి 15 శాతం ఎక్కువగా పాలు లభిస్తాయని అన్నారు. మార్చి 31వ తేదీ నుంచి ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ద్వారా దాణా తయారీకి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రవి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది