BRUHADISWARALAYA KUMBHABISEKAM AT DHYANARAMAM ON MARCH 8 _ మార్చి 8న ధ్యానారామంలోని బృహదీశ్వరాలయ కుంభాభిషేకం

Tirupati, 07 March 2024: TTD is organising a grand Kumbahisekam at the Sri Bruhadiswara swami temple in the Sri Venkateswara Vedic University premises on March 8 as part of Maha Shivaratri fete.

The temple was built with the funds provided by the Srivani Trust comprising 18 pillar sculptural structures as per agama tenets.

Among others, TTD senior officials, SVV University vice chancellor Acharya Rani Sadasiva Murthy, Registrar Sri Radhesyam, a large number of university faculty members and students will participate in the fete.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 8న ధ్యానారామంలోని బృహదీశ్వరాలయ కుంభాభిషేకం

తిరుప‌తి, 2024, మార్చి 07: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆవరణంలో గల ధ్యానారామంలో ఉన్న శ్రీ బృహదీశ్వర స్వామి ఆల‌య కుంభాభిషేకం మార్చి 8న శివ‌రాత్రి ప‌ర్వ‌దినం రోజున ఘ‌నంగా జ‌రుగ‌నుంది.

శ్రీ‌వాణి ట్ర‌స్టు నిధుల‌తో టీటీడీ ఈ ఆల‌యాన్ని నిర్మించింది. విశ్వవిద్యాలయ పండితుల సూచనల మేర‌కు ఆగమశాస్త్రానుసారంగా 18 స్తంభాలతో శిల్పకళాశోభితంగా ఈ ఆల‌యాన్ని నిర్మించారు. కుంభాభిషేకం కార్య‌క్ర‌మంలో టీటీడీ ఉన్నతాధికారులు, వేద విశ్వవిద్యాలయ ఉప‌కులపతి ఆచార్య రాణీ సదాశివమూర్తి, రిజిస్ట్రార్‌ ఆచార్య రాధాగోవింద త్రిపాఠి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొంటారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.