VASANTHOTSAVAMS CONCLUDES _ ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు

Tirupati, 31 May 2021: The annual Vasantothsavams in Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram concluded on Monday.

As part of three-day annual spring festival, on the last day Snapana Tirumanjanam was performed to all the Parivara Utsavarulu and later Asthanam was performed.

Temple DyEO Smt Shanti and other office were present in the festival which was held in Ekantam due to Covid guidelines.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు

తిరుపతి, 2021 మే 31: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు సోమ‌వారం ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు.

మధ్యాహ్నం 1.30 నుండి 3.30 గంటల వరకు శ్రీ భూ సమేత వేంకటేశ్వరస్వామి, శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంత‌రం ఆస్థానం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.