SPECIAL EVENTS IN KRT _ మేలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
మేలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2022 ఏప్రిల్ 29: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.
– మే 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ జరుగనుంది.
– మే 7వ తేదీన శ్రీ కోదండరామస్వామివారి పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
– మే 16వ తేదీ పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి దర్శనం ఇవ్వనున్నారు.
– మే 30వ తేదీ అమావాస్య నాడు ఆలయంలో ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. రాత్రి 7 గంటలకు శ్రీ కోదండరామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం కటాక్షించనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
TIRUPATI, 29 APRIL 2022: The following are series of events in the month of May in Sri Kodanda Ramalayam at Tirupati.
May 7, 14, 21, 28: Abhishekam to Mula Murthies
May 16: Astottara Satakalashabhisekam on the occasion of Pournami
May 30: Sahasra Kalasabhishekam and Hanumanta Vahanam on the occasion of Amavasya
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI