PADMAVATI PARYINAYOTSAVAMS IN EKANTAM _ మే 20 నుండి 22వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

Tirumala, 19 May 2021: The annual Padmavathi Parinayotsavams will be observed in Ekantam from May 20 to 22 in Tirumala temple in view of the Covid pandemic.

According to legend, Akasa Raja did the celestial marriage of his daughter Padmavathi with Srinivasa on the auspicious day of Vaisakha Suddha Dasami in the advent of Purva Phalguni Nakshatra. TTD has been observing this fest since 1992. 

On the first day Sri Malayappa Swamy will be seated on Gaja Vahanam, second day on Garuda and on the final day on Aswa Vahanam. Everyday there will be Parinayotsavam rituals from 3pm onwards in Kalyana Mandapam inside the temple complex.

TTD has cancelled Arjitha Brahmotsavam and Sahasra Deepalankar Seva in connection with this festival.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 20 నుండి 22వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

తిరుమల, 2021 మే 19: శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే 20 నుండి 22వ తేదీ వరకు తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా జరుగనున్నాయి. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా టిటిడి ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది.

శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ‌మండ‌పంలో మూడు రోజులపాటు మధ్యాహ్నం 3 గంటల నుండి ఈ వేడుకలు నిర్వ‌హిస్తారు. తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్కఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీల్లో వేంచేపు చేస్తారు. ఆ తరువాత ప‌రిణ‌యోత్స‌వ కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు :

శ్రీ ప‌ద్మావ‌తి పరిణయోత్సవాల సంద‌ర్భంగా మే 20 నుండి 22వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

పౌరాణిక ప్రాశస్త్యం :

పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు వైకుంఠం నుండి శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది. ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో ప్ర‌తి ఏటా శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు నిర్వ‌హించేవారు. ప్ర‌స్తుతం కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో భక్తుల ఆరోగ్యభ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.