ANKURARPANAM OF APPALAYAGUNTA SRI PV TEMPLE ON MAY 30 _ మే 30న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Tirupati,29, May 2023: TTD is organising Ankurarpanam fete for the annual Brahmotsavam celebrations of Sri Prasanna Venkateswara temple, Appalayagunta on May 30
31-05-2023 Dwajarohanam and Pedda Sesha Vahana
01-06-2023 Chinna Sesha Vahana and hamsa vahana
02-06-2023 Simha Vahana and Muthyapu pandiri Vahana
03-06-2023 Kalpavruksha Vahana and Kalyanotsavam and Sarva bhupala vahana
04-06-2023 Mohini avatars. And Garuda Vahana
05-06-2023 Hanumantha vahana and Gaja vahana
06-06-2023 Surya Prabha and Chandra Prabha Vahana
07-06-2023 Rathotsavam and Aswa vahana
08-06-2023 Chakrasnanam and Dwaja Avarohanam
TTD is organising vahana Sevas both morning and evening and on June 3 a grand Kalyanotsavam is being organised in the evening in which a devotee couple could participate with a ticket of ₹500 and beget Prasadam of one uttarium, blouse, laddu and appam.
The artists of TTD’s HDPP, Dasa Sahitya project and Annamacharya project will conduct cultural programs including bhajans, kolatas etc on all nine days of the Brahmotsavam.
మే 30న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2023 మే 29: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 31వ తేదీ నుండి జూన్ 8 వ తేదీ వరకు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు మే 30వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.
వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదయం సాయంత్రం
31-05-2023 ధ్వజారోహణం పెద్దశేష వాహనం
01-06-2023 చిన్నశేష వాహనం హంస వాహనం
02-06-2023 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
03-06-2023 కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
04-06-2023 మోహినీ అవతారం. గరుడ వాహనం
05-06-2023 హనుమంత వాహనం గజ వాహనం
06-06-2023 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
07-06-2023 రథోత్సవం అశ్వవాహనం
08-06-2023 చక్రస్నానం ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 3వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.