FLOAT FESTIVAL OF TIRUCHANOOR SRI PAT FROM MAY 31 – JUNE 4 _ మే 31 నుండి జూన్ 4వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు

Tirupati,29, May 2023: TTD is organising the annual float festival ( Teppotsavam) of Sri Padmavati temple, Tiruchanoor from May31-June 4 where in Sri Padmavati will ride the float in the evening on all five days and bless devotees.

Legend says that Sri Padmavati aka Aluvelu Mangamma will Accept Panchatantra Agama pujas on all five days and ride a float in the Padma Sarovar every year from Jayesta shudda Ekadasi to Pournami. 

On day-1  the float will be adorned by Sri Krishna swami with consorts Sri Rukmini and Satyabhama.On Day-2 as Sri Sundararaja swamp and as Sri Padmavati on the rest three days. The celestial fete of snapana thirumanjanam will be performed on the last three days at the Nirada Mandapam.

Similarly, Gaja Vahana Seva is performed on June 3 and Garuda vahana Seva on June 4 evenings. On all days of teppotsavam Sri Padmavati is paraded on the Mada streets.

ARJITA SEVAS CANCELLED

TTD has cancelled the Arjita Sevas of Kalyanotsavam and unjal Sevas on all five days of the float festival.

The artists of TTD’s HDPP, Dasa Sahitya project and Annamacharya project will conduct cultural programs including bhajans, kolatas etc on all five days of the float festival.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 31 నుండి జూన్ 4వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుపతి, 2023 మే 29: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు మే 31 వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు.

తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుంది. పద్మసరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం.

మే 31వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3.30 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహించ‌నున్నారు. అమ్మవారికి జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు గజవాహనం, జూన్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు గరుడ వాహనసేవ నిర్వ‌హిస్తారు. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజు ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు రద్దు :

తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.