MAHA SAMPROKSHANA FETE AT RAMPACHODAVARAM SV TEMPLE OBSERVED _ రంపచోడవరంలో ఆగమోక్తంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ
* SRIVARI DARSHAN COMMENCES AT THE SV TEMPLE
Tirupati,21, May 2023: The celestial Maha Samprokshana fete was performed at the newly built Sri Venkateshwara temple in Rampachodavaram of Alluri Seetharamaraju District on Monday.
Earlier in the day Nitya Kaikaryams and Vaidika programs were held in the Yagashala and Maha Samprokshana fete was conducted in the auspicious Mithuna lagnam followed by Yatra Danam, Kumbha Pradakshina and Kala Vahana programs.
Later on Akshatarohana, Brahma Gosha and Acharya Bahumanam were also held.
All the rituals were carried out under the supervision of TTD Agama Advisor Sri Ramakrishna Deekshitulu while Archaka Sri Sai Swamy and other religious staff were also present.
TTD commenced Srivari Darshan to devotees from the tribal region of Rampachodavaram from 10am onwards and also distributed drinking water, buttermilk and Annaprasadams.
IMPECCABLE SERVICES BY SRIVARI SEVAKULU
About 500 Srivari Sevakulu from the Rampachodavaram region braved the scorching heat and rendered services including the distribution of buttermilk, water, annaprasadam on all the six days of Maha Samprokshana fete.
The artists of TTD dharmic projects also conducted several cultural programs including sankeetans, bhajans etc. and allured the devotees.
Local MP Sri Bharat, MLA Smt Dhanalakshmi, JEO Sri Veerabrahmam, PRO Dr T Ravi, SE Sri TV Satyanarayana, DyEOs Sri Gunabhushan Reddy, Sri Venkataiah, Sri Siva Prasad, Garden Deputy Superintendent Sri Srinivasulu, EE Sri Sudhakar and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
రంపచోడవరంలో ఆగమోక్తంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ
– శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం ప్రారంభం
తిరుపతి, 2023 మే 22: అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ సోమవారం ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉదయం 5 నుండి 8.15 గంటల వరకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8:15 నుండి 8:45 గంటల వరకు యాగశాలలో మహాపూర్ణాహుతి జరిగింది. ఉదయం 8:45 నుండి 9 గంటల వరకు యాత్ర దానము, కుంభ ప్రదక్షిణ చేశారు. ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ, కళావాహన చేపట్టారు. ఈ క్రతువుల ద్వారా యాగశాలలోని కలశాలలో ఇమిడి ఉన్న దేవతాశక్తిని శ్రీ వేంకటేశ్వరస్వామి,
శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాల్లోకి ఆవాహన చేశారు. అనంతరం అక్షతారోపణ, బ్రహ్మఘోష, ఆచార్య బహుమానం అందించారు.
భక్తులకు దర్శనం ప్రారంభం
మహాసంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఉదయం 10 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. రంపచోడవరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. విచ్చేసిన భక్తులందరికీ, తాగునీరు, మజ్జిగ ,అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
శ్రీవారి సేవకుల విశేష సేవలు
రంపచోడవరం ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా ఆరు రోజులపాటు నిర్వహించిన కార్యక్రమాల్లో శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, ఆలయానికి అవసరమైన పూలు కట్టడం లాంటి సేవలు అందించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి దాదాపు 500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపి శ్రీమార్గాని భరత్, ఎమ్మెల్యే శ్రీమతి ధనలక్ష్మి, జేఈవో
శ్రీ వీరబ్రహ్మం, సిఈ శ్రీ నాగేశ్వరరావు, పిఆర్వో డాక్టర్ రవి, ఎస్ ఈ శ్రీ టివి.సత్యనారాయణ, విజివో శ్రీ మనోహర్, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ వెంకటయ్య, శ్రీ శివప్రసాద్, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాస్, ఈఈ శ్రీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న భజన, కోలాట కార్యక్రమాలు
రంపచోడవరంలోని ఆలయం వద్ద గల వేదికపై టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. గిరిజన ప్రాంతాల నుంచి భజన బృందాలు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.