ELABORATE ARRANGEMENTS FOR RATHA SPATHAMI- TTD EO _ రథసప్తమికి విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా విస్తృత ఏర్పాట్లు- డయల్ యువర్ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

Tirumala, 02 February 2024: TTD is making elaborate arrangements to conduct the annual Ratha Sapthami fete on February 16 which is also known as Mini Brahmotsavam, said TTD EO Sri AV Dharma Reddy.

 

Before taking the calls from pilgrim devotees during the monthly Dial your EO programme, the EO briefed about the development activities taken up by TTD in the past one month and also the upcoming religious events at Annamaiah Bhavan in Tirumala on Friday. Highlights:

 

Sri Malayappa Swamy will ride on the Surya Prabha, Chinna Sesha, Garuda, Hanumanta, Kalpavruksha, Sarva bhupala and Chandra Prabha Vahanams on a single day on the Mada streets to bless the devotees. TTD is making all arrangements for Anna Prasadam, drinking water etc. to devotees sitting in the galleries all along the Mada streets throughout the day.

 

Dharmic Sadas 

 

To promote Sanatana Hindu dharma, spread the glory of Sri Venkateswara, to stall religious conversions and to empower human values among children from a young age itself, TTD is conducting a unique Dharmic Sadas at Asthana Mandapam, Tirumala from February 3-5.

 

57 Peethadhipatis from all over the Country are participating. Their suggestions and advice will be extensively used for the implementation of Dharmic programs.

 

Special festivals at Tirumala 

 

Sri Purandara Dasa Aradhana Mahotsavam from February 8 to10.

On February 7 Sri Venkateswara Navarathna Mala Sangeeta program is organised with young artists at Kalyana Vedika.

 

Vishnu Sahasranama Stotra Parayanam on February 20 in connection with Bhishma Ekadasi at Nada Neeranjanam platform.

 

Kumaradhara Theertha  Mukkoti on February 24.

 

Achievements

 

In the last 26 months 2350 heart surgeries, 11 Heart Transplants including a successful heart operation to a two-day-old baby were successfully performed in Sri Padmavathi Children’s Heart Centre.

 

New building dedicated to children as a super speciality hospital is titled as Sri Padmavati Institute of Child Health.

 

On January 18, Multi-organ transplant operations of heart, liver and kidneys were simultaneously performed with organs provided by a brain-dead person in an accident donated by his parents from Somanatham village, of Poothalapattu mandal of Chittoor district.

 

TTD-run SV Arts College, SGS Arts College and Sri Padmavati Degree College

have received prestigious Autonomous status from UGC which helps these institutions in the latest teaching methods, exams, to stand out in the competitive world with syllabus adaptation and attractive campus placements.

 

IT wing has identified 52 websites and 13 mobile apps as fakes and filed complaints with the police.

 

The devotees are requested to beware of such digital frauds and trust only the official portal of TTD, ttdevasthanams.ap.gov.in for booking Darshan, rooms, making donations etc.

 

Events in other TTD temples

 

Sri Lakshmi Venkateswara Swami Brahmotsavam in Devuni Kadapa from February 10-18.

 

Ratha Sapthami at Sri Padmavati Ammavari temple at Tiruchanoor, Sri Govindarajaswami temple, Sri Kalyana Venkateswara temple Narayanavanam

Teppotsavam at Sri Govindarajaswami temple from February 17-23

 

Annual Karthika Brahmotsavam of Sri Kalyana Venkateswara temple, Srinivasa Mangapuram from February 29-March 8.

 

Annual Brahmotsavam of Sri Kapileswara temple from March 01-10

 

While briefing the media after the live phone-in program, the EO shared the details of pilgrims in the month of January. 

 

Srivari Darshan – 21.09 lakh devotees

 

Hundi collection – 116.46 crore

 

Laddu Prasadam -1.03 crore

 

Anna Prasadam- 46.46 lakh 

 

Kalyana Katta – 7.05 lakh

 

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, SVETA Director Sri Subramanyam Reddy and other officers were also present.

 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

రథసప్తమికి విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా విస్తృత ఏర్పాట్లు

– సనాతన హైందవ ధర్మ పరిరక్షణకే ధార్మిక సదస్సు

– డయల్ యువర్ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 02 ఫిబ్రవరి 2024: ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు, భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఒకేరోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తార‌న్నారు.

– వాహనసేవలను వీక్షించేందుకు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

ధార్మిక సదస్సు :

– హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు, మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్నవయసు నుండే పిల్లల్లో మానవతా విలువలను పెంపొందించేందుకు తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహించనున్నాం.

– దేశం నలుమూలల నుండి 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు విచ్చేయనున్నారు.

– పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు స్వీకరించి మరింతగా ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాం.

తిరుమలలో విశేష ఉత్సవాలు :

– తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 8 నుండి 10వ తేదీ వరకు శ్రీపురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం.

– ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న తిరుమల కల్యాణ వేదికలో యువ కళాకారులతో ‘‘శ్రీ వేంకటేశ్వర నవరత్నమాలిక’’ సంగీత కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

– ఫిబ్రవరి 20న భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం తిరుమల నాదనీరాజనం వేదికపై శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం నిర్వహిస్తాం.

– ఫిబ్రవరి 24న కుమారధార తీర్థ ముక్కోటి.

శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రి :

– శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రిలో 26 నెలల్లో 2,350 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించాం. రెండు రోజుల వయసు గల చంటిపాపకు కూడా గుండె ఆపరేషన్‌ చేయడం విశేషం. రాష్ట్రంలో తొలిసారిగా 11 గుండెమార్పిడి శస్త్రచికిత్సలు చేపట్టాం.

– కొత్త ఆసుపత్రిని శ్రీ పద్మావతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్‌ హెల్త్‌ పేరిట చిన్నపిల్లలకు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దనున్నాం.

స్విమ్స్‌లో విజయవంతంగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు :

– తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రిలో జనవరి 18వ తేదీన గుండె, లివర్‌, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను వైద్యులు ఏకకాలంలో విజయవంతంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం, సామనత్తం గ్రామానికి చెందిన గొల్లపల్లి హేమకుమార్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో అతని తల్లిదండ్రులు మానవతాదృక్పథంతో అవయవదానానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్విమ్స్‌ వైద్య బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.

– స్విమ్స్ ఆసుప‌త్రిలో అవ‌య‌వ మార్పిడికి అవ‌స‌ర‌మైన అధునాతన వైద్య‌ పరికరాలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. స్విమ్స్ అందిస్తున్న సౌక‌ర్యాల‌ను వినియోగించుకోవాల‌ని కోరారు.

మూడు కళాశాలలకు అటానమస్‌ హోదా :

– టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలకు అటానమస్‌ హోదా లభించింది. తద్వారా కళాశాలల అభివృద్ధికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశంతోపాటు విద్యావిధానం, పరీక్షల నిర్వహణ, పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సిలబస్‌లో మార్పులు చేసుకోవడం వీలవుతుంది. ప్రాంగణ ఎంపికలకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వస్తాయి.

నకిలీ వెబ్‌సైట్లతో మోసపోకండి :

– శ్రీవారి భక్తులు నకిలీ వెబ్‌సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టీటీడీ ఐటి విభాగం క్షుణ్ణంగా పరిశీలించి 52 నకిలీ వెబ్‌సైట్లను, 13 నకిలీ మొబైల్‌ యాప్‌లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

– టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్‌ చేసుకోవాలని భక్తులను కోరుతున్నాం.

ఇతర ఆలయాల్లో…

– ఫిబ్రవరి 10 నుండి 18వ తేదీ వరకుదేవుని కడపశ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు.

– ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారు, నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు సప్త వాహనాలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

– ఫిబ్రవరి 17 నుండి 23వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు.

– శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తాం.

– తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తాం.

జనవరి నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 21.09 లక్షలు.

హుండీ :

– హుండీ కానుకలు – రూ.116.46 కోట్లు.

లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 1.03 కోట్లు.

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 46.46 లక్షలు.

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 7.05 లక్షలు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.