TRANSFER KNOWLEDGE TREASURE IN PALM LEAF SCRIPTS TO FUTURE GENERATIONS- TTD EO _ రాత ప్రతుల్లోని విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి- టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి

Tirupati, 6 Jan. 22: It is the responsibility of everyone to transfer the knowledge treasure on science, culture and technology embedded in ancient palm leaf manuscripts by Saints and Rishis for the benefit of future generations said TTD EO Dr KS Jawahar Reddy.

Speaking after a review meeting with officials on the issue of digitisation of Palm leaf and copper plate manuscripts at his chambers in the TTD Administrative building on Thursday evening the EO directed officials to digitise all manuscripts available with TTD and also in the libraries of universities as per regulations of the National Manuscripts Department.

He asked officials to prepare a comprehensive report to use any available building or build a new infrastructure for the installation of equipment for the digitisation programme.

TTD JEOs Smt Sada Bhargavi (E&H) and Sri Veerabrahmam, Vice-Chancellor of Rashtriya Sanskrit University Acharya Muralidhar Sharma, SV Vedic University Vice-Chancellor Acharya Sannidhanam Sudarshan Sharma, TTD DEO Sri Govindarajan and Sanatana Jeevan Samstha Representative Smt Vijayalakshmi and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రాత ప్రతుల్లోని విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి – టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి

తిరుపతి 6 జనవరి 20 22: కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షులు, రుషులు, పెద్దలు ఎంతో విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలను నిక్షిప్త పరచిన రాత ప్రతులను ( మాన్యు స్క్రిప్ట్స్) భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిమీద ఉందని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు.

రాత ప్రతుల డిజిటైజ్ అంశంపై గురువారం సాయంత్రం తన చాంబర్లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టీటీడీతో పాటు, తిరుపతిలోని యూనివర్సిటీలు గ్రంథాలయాల్లో ఉన్న రాత ప్రతులను డిజిటైజ్ చేయడానికి కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం జాతీయ రాత ప్రతుల సంస్థ (నేషనల్ మాన్యు స్క్రిప్ట్స్ డిపార్ట్మెంట్ ) నియమ నిబంధనల ప్రకారం ఎలా డిజిటైజ్ చేయాలి, వాటిని ఎలా భద్రపరచాలి అనే అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పని కోసం అందుబాటులో ఉన్న ఒక భవనాన్ని వాడు కోవాలని, తగిన భవనం అందుబాటులో లేకపోతే కొత్త భవన నిర్మాణానికి స్థలాన్ని గుర్తించాలన్నారు. రాతప్రతుల డిజిటైజ్ కోసం అత్యాధునిక పరికరాలు సమకూర్చుకోవాలని, ఇందుకు సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.

జెఈవో ( విద్య మరియు వైద్యం) శ్రీమతి సదా భార్గవి, జెఈవో శ్రీ వీర బ్రహ్మం, జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళీధర్ శర్మ, వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, దేవస్థానం విద్యాశాఖ అధికారి శ్రీ గోవింద రాజన్, సనాతన జీవన సంస్థ ప్రతినిధి శ్రీమతి విజయలక్ష్మి ఈ సమావేశంలో పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది