EO REVIEWS ON PRESIDENT OF INDIA VISIT _ రాష్ట్రపతి పర్యటన పై ఈఓ సమీక్ష

Tirupati, 18 Nov. 20: TTD EO Dr KS Jawahar Reddy on Wednesday reviewed the preparations for scheduled visit of Honourable President of India Sri Ramnath Kovind on November 24 to Tirumala and Tiruchanoor.

Addressing the review meeting at TTD administrative building on Wednesday, the TTD EO instructed officials on arrangements for President visit to Srivari temple, Sri Varahaswami temple at Tirumala and Sri Padmavati temple at Tiruchanoor.

The TTD EO directed officials to take necessary steps to observe protocol and also COVID-19 guidelines.

District collector Sri Bharat Narayana Gupta, Additional EO Sri A V Dharma Reddy, JEOs Sri P Basant Kumar and Smt Sada Bhargavi, Joint collector Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, SP Sri Ramesh Reddy were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

రాష్ట్రపతి  పర్యటనపై ఈఓ సమీక్ష

తిరుప‌తి, 2020 నవంబరు 18: రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ నవంబరు 24వ తేదీ తిరుచానూరు, తిరుమల పర్యటనకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన సమీక్షలో రాష్ట్రపతి తిరుచానూరు అమ్మవారి ఆలయం, తిరుమలలో శ్రీ వరాహస్వామి ఆలయం, శ్రీవారి ఆలయంలో దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర పతి దర్శనానికి వచ్చిన సమయంలో ప్రొటోకాల్ ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లు,  కోవిడ్-19 నిబంధనల గురించి చర్చించారు.

ఈ స‌మీక్ష‌లో జిల్లా కలెక్టర్ శ్రీ భరత్ నారాయణ గుప్తా, అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి, జెఈఓలు శ్రీ బసంత్ కుమార్, శ్రీమతి సదా భార్గవి, జాయింట్ కలెక్టర్ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, అర్బ‌న్ ఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.