VEHICLES TO BE ALLOWED TO TIRUMALA BY LINK ROAD- TTD ADDITIONAL EO _ లింకు రోడ్డు ద్వారా తిరుమ‌ల‌కు వాహ‌నాల అనుమ‌తి

– RESTORATION WORKS TO COMPLETE IN 25 DAYS

 

– ADDITIONAL EO INSPECTS LANDSLIDES REGIONS

 

– RESCHEDULE OF DARSHAN TICKETS FACILITATED TILL DEC 10

 

Tirumala, 3 Dec. 21: Under the directives of TTD Trust Board Chairman Sri YV Subba Reddy, the Additional EO Sri AV Dharma Reddy on Friday, inspected the regions damaged by the recent rain havoc along with IIT experts and Engineering Officials of TTD

 

Speaking on the occasion he said, from December 4 morning onwards the link road will be opened up for transportation to reduce distance and duration for vehicular traffic from Alipiri to Tirumala besides the waiting woes of pilgrims.

 

The Additional EO said following a massive rockfall on December 1 at around 6am, the up Ghat road was critically damaged at three locations.

 

He said the IIT experts from New Delhi after thorough inspection stated that there will be no threat of rock felling and we can safely open up the Link road operations for vehicular movements. This will facilitate in reducing the waiting and travel time gap by almost 75 %.

 

He said the IIT experts interacted with the TTD Chairman on the issue of restoration works on Ghat road and said that it will take at least one month and hence the top engineering Company Afcon has been selected for the works who have been directed to submit a design within 20 days.

 

He said another experts team had surveyed the boulders and suggested anchoring, trimming etc. for strengthening the rock deposits within 25 days.

 

ON DARSHAN TICKETS

 

The Additional EO Sri AV Dharma Reddy said TTD decided to facilitate the rescheduling facility of Srivari darshan for the devotees till December 10. Those who could not make it for darshan inspite of having valid tickets due to inclement weather from November 18 onwards, shall reschedule their darshan dates within six months,

 

He appealed to devotees to make note that this special initiative is aimed at to facilitate all those devotees who could not come to Tirumala due to heavy rains.

 

CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Nageswara Rao SE Sri Jagadeeswara Reddy, IIT Expert Dr KS Rao and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

లింకు రోడ్డు ద్వారా తిరుమ‌ల‌కు వాహ‌నాల అనుమ‌తి

– 25 రోజుల్లో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు పూర్తి

– కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ప్రాంతాల‌ను ప‌రిశీలించిన టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

– న‌వంబ‌రు 18 నుండి డిసెంబ‌రు 10వ తేదీ వ‌ర‌కు ద‌ర్శ‌న టికెట్లు గ‌ల భ‌క్తుల‌కు రీషెడ్యూల్ స‌దుపాయం

తిరుమ‌ల‌, 2021 డిసెంబ‌రు 03: రెండో ఘాట్ రోడ్డులో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన నేప‌థ్యంలో తిరుపతి – తిరుమ‌ల మ‌ధ్య వాహ‌నాల్లో ప్ర‌యాణించేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌డుతోంద‌ని, ఈ ఆల‌స్యాన్ని త‌గ్గించేందుకు డిసెంబ‌రు 4వ తేదీ ఉద‌యం నుండి లింకు రోడ్డు ద్వారా వాహ‌నాల‌ను అనుమ‌తిస్తామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆదేశాల మేర‌కు శుక్ర‌వారం సాయంత్రం అద‌న‌పు ఈవో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ప్రాంతాన్ని ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా అద‌నపు ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబ‌రు 1న ఉద‌యం అప్ ఘాట్ రోడ్డులో చివ‌రి మలుపు వ‌ద్ద వ‌ర్షానికి భూమి వ‌దులై పెద్ద బండ‌రాళ్లు ఊడి ప‌డ్డాయ‌ని, ఈ కార‌ణంగా 3 రోడ్ల‌కు పూర్తిగా న‌ష్టం వాటిల్లింద‌ని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా త‌నిఖీ చేశామ‌ని, ఢిల్లీ ఐఐటి ప్రొఫెస‌ర్లు క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేశార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఒక బండ‌రాయి ఊడిప‌డేలా ఉండ‌డంతో దాని ప‌టిష్ట‌త‌ను ఐఐటి నిపుణులు ప‌రిశీలించి ఎలాంటి స‌మ‌స్య ఉండ‌ద‌ని, ట్రాఫిక్‌ను అనుమ‌తించాల‌ని సూచించార‌ని తెలిపారు. కావున అప్ ఘాట్ రోడ్డులో వాహ‌నాల‌ను అనుమ‌తించి లింక్ రోడ్డు ద్వారా డౌన్ ఘాట్‌కు వెళ్లి తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తామ‌ని వివ‌రించారు. త‌ద్వారా 75 శాతం ఆల‌స్యాన్ని అధిగ‌మించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

కొండ‌చ‌రియ‌లు విరిగిన ప్రాంతంలో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు పూర్తి చేసే విష‌యంపై ఐఐటి నిపుణులు, ఇంజినీరింగ్ అధికారుల‌తో టిటిడి ఛైర్మ‌న్ శుక్ర‌వారం స‌మావేశం నిర్వ‌హించార‌ని చెప్పారు. పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు పూర్తి చేసేందుకు ఒక నెల స‌మ‌యం ప‌డుతుంద‌ని నిపుణులు సూచించార‌ని, ఇందుకోసం ఎంతో నైపుణ్యం గ‌ల ఆఫ్కాన్ సంస్థ‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించామ‌ని తెలిపారు. ఆఫ్కాన్ సంస్థ‌కు చెందిన ఒక నిపుణుల బృందం 20 రోజుల్లో డిజైన్ సిద్ధం చేయాల‌ని కోరామ‌ని, మ‌రో నిపుణుల బృందం ఘాట్ రోడ్డులో అన్ని బండ‌రాళ్ల‌ను ప‌రిశీలించి స‌ర్వే చేసి మ‌రింత బలంగా మార్చేందుకు యాంక‌రింగ్‌, ట్రిమ్మింగ్ త‌దిత‌ర ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించామ‌ని వెల్ల‌డించారు. ఈ మొత్తం ప‌నులు 25 రోజుల్లో పూర్త‌వుతాయ‌న్నారు.

అదనపు ఈవో వెంట సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వర రావు, ఢిల్లీ ఐఐటి నిపుణులు శ్రీ కె.ఎస్‌.రావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇఇ శ్రీ సురేంద్రారెడ్డి, ఆఫ్కాన్ సంస్థ ఇంజినీరింగ్ నిపుణులు ఉన్నారు.

న‌వంబ‌రు 18 నుండి డిసెంబ‌రు 10వ తేదీ వ‌ర‌కు ద‌ర్శ‌న టికెట్లు గ‌ల భ‌క్తుల‌కు రీషెడ్యూల్ స‌దుపాయం

న‌వంబ‌రు 18 నుండి డిసెంబ‌రు 10వ తేదీ వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు గ‌ల భ‌క్తులు త‌మ ద‌ర్శ‌న తేదీని రీషెడ్యూల్ చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు.

భారీ వ‌ర్షాల కార‌ణంగా ఈ తేదీల్లో తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రాలేక‌పోయిన భ‌క్తులు 6 నెల‌ల్లోపు ద‌ర్శ‌న స్లాట్ల‌ను రీషెడ్యూల్‌ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని, భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోరారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.