DEVOTEE LAUDS TTD VIG SERVICES _ విజిలెన్స్‌ కంట్రోల్ రూమ్‌ సిబ్బందిని అభినందించిన భ‌క్తుడు

TIRUMALA, 17 NOVEMBER 2021: A Sholapur, Maharastra based devotee, Sri Kedar Rajendra Kulkarni lauded the dedicated services of TTD Vigilance sleuths.

In an e-mail sent to TTD EO Dr KS Jawahar Reddy, the devotee mentioned that he has forgotten his luggage in a taxi on November 16 while booking a room at Koustubham Rest House.

He noticed that he left one of his bags in the Taxi itself at around 1:15pm. Immediately he informed Police and TTD Common Command Control. With the timely intervention of both TTD Vigilance and Police, his lost bag was restored to him within half an hour.

TTD CVSO Sri Gopinath Jatti also appreciated his sleuths for their quick response in restoring the lost baggage.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

విజిలెన్స్‌ కంట్రోల్ రూమ్‌ సిబ్బందిని అభినందించిన భ‌క్తుడు – టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి ఇ-మెయిల్‌

తిరుమల, 2021 న‌వంబ‌రు 17: తిరుమ‌ల‌లో ట్యాక్సీలో మ‌రిచిపోయిన ల‌గేజి బ్యాగును వెంట‌నే గుర్తించి అప్ప‌గించినందుకు గాను మ‌హారాష్ట్ర‌కు చెందిన భ‌క్తుడు విజిలెన్స్‌ కంట్రోల్ రూమ్‌ సిబ్బందిని, తిరుమ‌ల పోలీసుల‌ను అభినందించారు. ఈ మేర‌కు భ‌క్తుడు సంతృప్తి వ్య‌క్తం చేస్తూ టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి బుధ‌వారం ఇ-మెయిల్ పంపారు.

మ‌హారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన శ్రీ కేదార్ రాజేంద్ర కుల‌క‌ర్ణి అనే భ‌క్తుడు న‌వంబ‌రు 16వ తేదీన‌ మ‌ధ్యాహ్నం 12.10 గంట‌ల ప్రాంతంలో కౌస్తుభం విశ్రాంతి గృహానికి వెళ్లేందుకు ట్యాక్సీని బుక్ చేసుకున్నారు. విశ్రాంతి గృహానికి చేరుకున్న హ‌డావిడిలో ఒక బ్యాగును ట్యాక్సీ డిక్కీలో మ‌రిచిపోయారు. మ‌ధ్యాహ్నం 1.15 గంట‌ల ప్రాంతంలో గుర్తించి తిరుమ‌ల పోలీసుల‌ను, టిటిడి విజిలెన్స్ క‌మాండ్ కంట్రోల్ రూమ్ అధికారుల‌ను ఆశ్ర‌యించారు. నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బంది, పోలీసులు వెంట‌నే విచార‌ణ ప్రారంభించి పోగొట్టుకున్న బ్యాగును మ‌ధ్యాహ్నం 1.50 గంట‌ల‌క‌ల్లా భ‌క్తుడికి తిరిగి అప్ప‌గించారు.

భ‌క్తుడి ల‌గేజి బ్యాగును స‌త్వ‌రం వెతికి తిరిగి అప్ప‌గించిన టిటిడి విజిలెన్స్‌ కంట్రోల్ రూమ్‌, భ‌ద్ర‌తా సిబ్బందిని సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి అభినందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.