BLOOD DONATION CAMP HELD _ విజిలెన్స్ అవగాహన వారోత్సవాల‌ సందర్భంగా రక్తదాన శిబిరం

TIRUPATI, 28 OCTOBER 2021: As part of Vigilance Awareness Week, Blood Donation Camp was held by TTD Vigilance sleuths on Thursday.

 

TTD CVSO Sri Gopinath Jatti who graced the occasion as chief guest, said that all the vigilance and security personnel have been rendering impeccable services to pilgrims inspite of severe pressures. He complimented their dedication in discharging their duties.

 

Later 81 sleuths donated blood in Sri Padmavathi Paediatric Cardiac hospital premises.

 

VGOs Sri Manohar, Sri Bali Reddy, AVSOs Sri Sai Giridhar, Smt Kalavathi were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

విజిలెన్స్ అవగాహన వారోత్సవాల‌ సందర్భంగా రక్తదాన శిబిరం

తిరుపతి, 2021 అక్టోబ‌రు 28: విజిలెన్స్ అవగాహన వారోత్సవాల‌ సందర్భంగా టిటిడిలో విధులు నిర్వహిస్తున్న నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బంది రక్తదానం చేశారు. తిరుప‌తి బ‌ర్డ్ ఆసుప్ర‌తి ప్రాంగ‌ణంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల వైద్యశాలలో గురువారం ఉదయం పలువురు ఏవిఎస్వో లు, విజిలెన్స్ ఇన్స్ పెక్టర్ల తో పాటు 81 మంది భ‌ద్ర‌తా సిబ్బంది రక్తదానం చేశారు.

రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా సివిఎస్వో మాట్లాడుతూ టిటిడి భ‌ద్ర‌తా సిబ్బంది ఎన్నో ఒత్తిడుల మధ్య బాధ్యతాయుతంగా విధులను నిర్వహిస్తున్నారని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ మ‌నోహ‌ర్‌, ఎవిఎస్వోలు శ్రీ‌మ‌తి క‌ళావ‌తి, శ్రీ సాయి గిరిధ‌ర్ భ‌ద్ర‌తా సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.