వివరణ(20-1-2009 )

”కలియుగ కౌరవులు” అనే శీర్షికతో ప్రచురించిన వార్తకు వివరణ

విషయం :- 20-1-2009 తేదిన ఈనాడు దినపత్రిక చిత్తూరు జిల్లా ఎడిషన్‌లో ”కలియుగ కౌరవులు” అనే శీర్షికతో ప్రచురించిన వార్తకు వివరణ.

తిరుమల తిరుపతి దేవస్థానములో విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నతమైన సంస్థ తి.తి.దే పాలకమండలి. కొందరు పాలకమండలి సభ్యులు తి.తి.దే ఆదాయానికి గండి కొడుతున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొనడం పూర్తిగా నిరాదారం, అవాస్తవం. ఈ విషయాలు తి.తి.దే ఉన్నతాధికారులకు తెలుసునని పేర్కొనడం కూడా పూర్తిగా నిరాదారం.

అదేవిధంగా తి.తి.దే పాలకమండలి సభ్యులు చెన్నై సమాచార కేంద్రానికిగాని మరే యితర సమాచార కేంద్రానికిగాని ఛైర్మెన్‌లుగా వ్యవరించాలని కోరలేదు. ఇది పూర్తిగా నిరాదారమైన ఆరోపణ. తి.తి.దే మార్కెటింగ్‌ వివాదంలో ఏసభ్యుడు పెత్తనం చెలాయించడంలేదు. తి.తి.దే పాలకమండలికి చెందిన ఏ సభ్యుడు కూడా తన చుట్టూయున్న అతిథి గృహాలను ఖాళీగా ఉంచాలని కోరలేదు.

తి.తి.దేవస్థానం ఉచిత దర్శనానికి వెళ్ళే ప్రతి భక్తునికి ఉచితంగా లడ్డు ప్రసాదం అందజేస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు 30 వేల నుండి 60 వేల వరకు ఉచితంగా లడ్డులను పంపిణీ చేస్తుంది. భక్తులకు అదనంగా లడ్డూ ప్రసాదం అవసరమైతే, ఒక లడ్డు కేవలం రూపాయలు 5/- లకే అందజేస్తోంది.
ఈ వివరణను సవివరంగా, ప్రముఖంగా ఈనాడు పత్రికలో ప్రచురించాలని మనవి.

తి.తి.దే, ముఖ్య ప్రజాసంబందాధికారి
కె.రామపుల్లారెడ్డి