CHAKRASNANAM HELD _ వేడుకగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

TIRUPATI, 07 APRIL 2022: Heralding the grand conclusion of nine-day annual Brahmotsavam, Chakra Snanam was performed in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Thursday.

The Avabhrida Snanam was a divine visual for the devotees who gathered to witness the fete that took place in the holy temple tank waters at Kapilatheertham.

Both Tirumala Pontiffs, Spl Gr DyEO Smt Parvati and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వేడుకగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

ముగిసిన బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2022 ఏప్రిల్ 07: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన గురువారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం(అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ముందుగా ఉదయం 7 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థానికి వేంచేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ మండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, నెయ్యి, పండ్ల రసాలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ త‌రువాత ఆస్థానం చేప‌ట్టారు.

ఉదయం 11.30 గంటలకు స్వామివారు శ్రీగోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోని పి.ఆర్‌ తోటకు వేంచేశారు. సాయంత్రం 4 గంటలకు అక్కడినుండి బయలుదేరి తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్తవీధి మీదుగా శ్రీకోదండరామాలయానికి చేరుకున్నారు. మధ్యలో శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, శ్రీవైఖానసాచార్యుల ఆలయంలో ఆస్థానం నిర్వహించారు. రాత్రి 8.30 నుండి 9 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

వాహ‌న‌సేవ‌లో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.