DEMISE OF SESHADRI SWAMY IS A HUGE LOSS TO TTD-EO _ శేషాద్రి స్వామి మరణం టీటీడీకి తీరని లోటు : ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

TIRUMALA, 29 NOVEMBER 2021:  The sudden demise of Tirumala temple OSD Sri Pala Seshadri is a huge loss to the management, expressed TTD EO Dr K S Jawahar Reddy.

In a statement released to media on Monday he said Sri Seshadri had dedicated his entire life in the service of Sri Venkateswara Swamy. “His dedicated, selfless, sincere, hard working and devoted services lasted for nearly four and a half years since his entry into TTD as Uttara Parupattedar in 2007.  Even he breathed his last while on duty representing TTD to take part in the Karthika Deepotsavam to be held in the Vizag Beach road today evening”, he added.     

Born in 1948 on July 15 in Tirupati, he always aspired to be in the abode of Sri Venkateswara in His service and always expressed to die at His lotus feet only. The almighty also blessed him to breathe his last on the auspicious day of Karthika Pournami that too while on duty.     

EO expressed his condolences to the family of Sri Seshadri.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శేషాద్రి స్వామి మరణం టీటీడీకి తీరని లోటు : ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

తిరుమల, 29 నవంబరు 2021: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ గా సుమారు నాలుగున్నర దశాబ్దాలు స్వామివారి సేవకు అంకితమైన వ్యక్తి శ్రీ శేషాద్రి స్వామి అని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి నివాళులర్పించారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 1978 నుంచి శ్రీవారి సేవలో  తరిస్తున్న శ్రీ శేషాద్రి స్వామి మరణం టీటీడీ కి తీరని లోటని ఆయన చెప్పారు.
 
వైజాగ్ లో సోమవారం  టీటీడీ నిర్వహించనున్న  కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన  శేషాద్రి స్వామి స్వామివారి సేవలోనే తనువు చాలించారని ఈవో చెప్పారు.  శ్రీవారికి వైఖానసా ఆగమోక్తంగా నిర్వహించే దిన, వార, పక్ష, మాస, సాలకట్ల సేవలు, ఉత్సవాల నిర్వహణలో  జియ్యంగార్లు, ఆలయ  అధికారులు, అర్చకులకు ఆయన సంధాన కర్తగా వ్యవహరించారన్నారు.

శ్రీవారి ఆలయంలో సేవలు, కైంకర్యాలు, ఉత్సవాల నిర్వహణ, విధుల కేటాయింపు అంశాలను క్రోఢీకరించిన శేషాద్రి స్వామి పుస్తకాలు భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. టీటీడీ లోని వివిధ ఆలయాల్లో సంప్రోక్షణ, బాలాలయ, వైదిక కార్యక్రమాలు, బయటి ప్రాంతాల్లో నిర్వహించిన కళ్యాణోత్సవాలు, శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తుల ముంగిటికి తీసుకుని వెళ్ళడానికి  సంస్థకు ఆయన అందించిన సహకారం మరువలేనిది ఈవో చెప్పారు.
 
శ్రీ పాల శేషాద్రి స్వామి 1948 జూలై 15 వ తేదీ తిరుపతిలో జన్మించి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న అపారమైన భక్తి వల్ల 1978లో టిటిడిలో ఉత్తర పార్ పత్తేదార్ గా ఉద్యోగం లో చేరి,
2007లో బొక్కసం ఇన్ఛార్జి గా ఉద్యోగ విరమణ చేశారని చెప్పారు. ఉద్యోగ విరమణ నుంచి నేటి వరకు ఆయన 43  సంవత్సరాలుగా స్వామివారి సేవలో తరించారని ఈవో తెలిపారు.

శ్రీ శేషాద్రి స్వామి కుటుంబ సభ్యులకు టీటీడీ తరపున, తాను వ్యక్తి గతంగా సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.
 
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది