శ్రీగోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
శ్రీగోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతి, జనవరి -18,2011: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఈనెల 24వ తేది నుంచి 30వ తేది వరకు 7 రోజులపాటు వైభవంగా జరుగనున్నవి.
గతంలో 5 రోజులపాటు జరిగే ఈ తెప్పోత్సవాలు పాలకమండలి నిర్ణయం మేరకు 7 రోజులు నిర్వహిస్తారు. ఈ తెప్పోత్సవాలలో మొదటి రోజు శ్రీకోదండరామస్వామి వారు, రెండవ రోజు శ్రీ పార్థసారధిస్వామివారు, మూడవ రోజు శ్రీ కళ్యాణవేంకటేశ్వరస్వామి వారు, నాల్గువ రోజు శ్రీకృష్ణస్వామి, ఆండాళ్ అమ్మవారు, ఐదవ రోజు నుంచి 3 రోజులపాటు శ్రీగోవిందరాజస్వామి వారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు కనువిందైన దర్శనభాగ్యం కల్పిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.